డ్యాషింగ్ డైరెక్టర్ మళ్లీ `గోలీమార్ ని దించుతున్నాడా?
ఇక ప్లాప్ లు ఇచ్చిన డైరెక్టర్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు అనే డౌట్ రావడం సహజమే. అయితే పూరి గత ట్రాక్ తో ఏదో హీరో ఛాన్స్ ఇస్తాడనే కాన్పిడెన్స్ కొందరిలో ఉంది.
వరుస పరాజయాల్లో ఉన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల తో బిజీగా ఉన్నారు. టైర్ -2 హీరోలు కూడా కొత్త దర్శకులతో ఇన్నోవేటివ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అనుభవం లేకపోయినా అవకాశం ఇచ్చి ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఇలా హీరోలంతా బిజీగా ఉండటంతో హిట్ ఇచ్చిన డైరెక్టర్లే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇక ప్లాప్ లు ఇచ్చిన డైరెక్టర్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు అనే డౌట్ రావడం సహజమే. అయితే పూరి గత ట్రాక్ తో ఏదో హీరో ఛాన్స్ ఇస్తాడనే కాన్పిడెన్స్ కొందరిలో ఉంది. ఈ నేపథ్యంలో పూరి కోసం మ్యాచో స్టార్ గోపీచంద్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇటీవలే పూరి అతడికి స్టోరీ చెప్పి మెప్పించారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. ఈ చిత్రం ఇద్దరికీ సాలిడ్ కంబ్యాక్ అవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం.
గోపీచంద్ కి కూడా చాలా కాలంగా సరైన విజయాలు లేవు. ఇటీవలే శ్రీనువైట్లతో విశ్వం చేసాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో గోపీచంద్ మార్కెట్ పైనా కొంత ప్రభావం పడిందే ప్రచారం జరుగు తుంది. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రం కోసం పూరి సీన్ లోకి రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి పూరి ఎలాంటి కంటెంట్ తో ముందుకొస్తాడో చూడాలి. ఆయన మార్క్ యాక్షన్ చిత్రం చేస్తాడా? కొత్తగా ట్రై చేస్తాడా? అన్నది చూడాలి.
ఒకప్పుడు పూరి ప్రొడక్ట్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా వెళ్లిపోయేది. డిస్ట్రిబ్యూటర్లు..బయ్యర్లు ఎగబడి కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. వరుస వైఫల్యాలు ఆయనపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసాయి. గోపీ చంద్ రూపంలో మరో అవకాశం పూరి చేతుల్లో కనిపిస్తుంది. మరి ఈసారైనా సాలిడ్ హిట్ తో కంబ్యాక్ అవుతారేమో చూడాలి.