రెమ్యునరేషన్ తగ్గించిన మాస్ హీరో!
రామబాణం సినిమాకి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న గోపీచంద్ శ్రీను వైట్ల మూవీకి మాత్రం మూడు కోట్లకే కమిట్ అయ్యాడంట.
మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ కూడా తాజాగా జరిగింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ మూవీ తెరకెక్కనుంది. వేణు దోనెపూడి ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మినిమమ్ బడ్జెట్ లోనే మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా రామబాణం సినిమాతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ పెట్టడం కూడా మూవీకి మైనస్ అని చెప్పొచ్చు. అయితే శ్రీను వైట్ల కూడా వరుస డిజాస్టర్స్ తో వెనుకబడి ఉండటంతో మినిమమ్ బడ్జెట్ లోనే ఈ మూవీ ప్లాన్ చేశారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందంట. ఈ మూవీ కోసం గోపీచంద్ రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించేసాడంట.
రామబాణం సినిమాకి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న గోపీచంద్ శ్రీను వైట్ల మూవీకి మాత్రం మూడు కోట్లకే కమిట్ అయ్యాడంట. నిర్మాతలు ఒప్పించడంతో పాటు వరుసగా ఫ్లాప్ లు పడటంతో గోపీచంద్ మార్కెట్ కూడా కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ కొట్టాలనే కసితో అటు దర్శకుడు, ఇటు హీరో ఉన్నారు.
ప్రస్తుతం ఒకటి, రెండు హిట్స్ పడగానే చిన్న హీరోలు కూడా మూడు కోట్లకి పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. టైర్ 2 హీరోల రేంజ్ లో ఉన్న గోపీచంద్ మాత్రం వరుస ఫ్లాప్ ల కారణంగా తన బడ్జెట్ మాత్రం తగ్గించుకోవాల్సి వచ్చింది. శ్రీను వైట్ల కూడా చాలా తక్కువ రెమ్యునరేషన్ లోనే ఈ సినిమా చేస్తున్నాడంట. ఇద్దరికి సక్సెస్ వస్తే మాత్రం మళ్ళీ వారి వేతనాలు పెంచుకునే ఛాన్స్ ఉంది.
చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. శ్రీను వైట్ల ఆరు నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన సెట్స్ పైకి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. మిగిలిన క్యాస్టింగ్ అండ్ క్రూ ఎవరనేది త్వరలో ఎనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.