మా ఆయన నుంచి విడదీసే ధైర్యం ఎవరికి ఉంది? గోవిందా భార్య!
బాలీవుడ్ నటుడు గోవిందా తన భార్య సునీత అహూజా నుంచి విడిపోతున్నారని వార్తలు వచ్చాయి.;
బాలీవుడ్ నటుడు గోవిందా తన భార్య సునీత అహూజా నుంచి విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను గోవిందా ఖండించారు. ఇప్పుడు ఆయన భార్య ఏకంగా పుకార్లు సృష్టించేందుకు వార్నింగ్ ఇచ్చారు. హిందీ రష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత విడాకుల వార్తల గురించి ప్రస్తావిస్తూ-``మేము విడిగా జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయన (గోవింద) రాజకీయాల్లో చేరినప్పుడు, నా కుమార్తె పెరుగుతోంది. పార్టీ కార్యకర్తలు తరచుగా మా ఇంటికి వచ్చేవారు. మేము షార్ట్స్ ధరించి ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం కాబట్టి.. మేము సమీపంలోనే ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఎవరైనా నన్ను, గోవిందను విడదీయడానికి ధైర్యం చేస్తే వారు ముందుకు రావాలి`` అని ఘాటుగా స్పందించారు.
ఈ జంట గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. సునీత గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా తన పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గోవింద ఇటీవల విడాకుల వార్తలను ఖండించారు. గోవందా కజిన్ ఆర్తి కూడా ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం నేను నా సినిమాలను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నాను అని గోవిందా అన్నారు. ఇప్పుడు గోవిందా భార్య అహూజా కూడా విడాకుల వార్తలను ఖండించారు.
గోవింద - సునీత 1987లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి కలిసి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు, కుమారుడు యశ్వర్ధన్ , కుమార్తె టీనా ఉన్నారు. గోవింద చివరిసారిగా 2023లో వచ్చిన రఘు రాజా రామ్ చిత్రంలో కనిపించారు. అయితే కొంతకాలం తర్వాత తిరిగి నటించాలనే తన ప్రణాళికలను నటుడు గోవిందా ఇటీవల ప్రకటించారు. ఆయన తదుపరి బాహే హాత్ కా ఖేల్, పింకీ డార్లింగ్, లెన్ డెన్: ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ చిత్రాల్లో కనిపించనున్నారు.