గ్రాండ్ ఎంట్రీ.. ఆ హీరో కొడుకు రాబోతున్నాడు
మనస్పర్ధలు వల్ల విడిపోయిన ఈ జంట ప్రస్తుతం విడిగా ఉంటూ.. ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో విభిన్న తరహా పాత్రల్లో నటించి తనకంటూ భారీ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మధ్యే ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. వీరికి ఇద్దరు కొడుకులు. మనస్పర్ధలు వల్ల విడిపోయిన ఈ జంట ప్రస్తుతం విడిగా ఉంటూ.. ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు.
కానీ పిల్లల విషయంలో ఇద్దరు బాధ్యతగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు తమ సినిమా ఈవెంట్లకు.. అఫీషియల్ ఫంక్షన్స్ కు.. పిల్లలను తీసుకుని వెళ్ళడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై లో జరిగిన 'లాల్ సలామ్' ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఐశ్వర్య పెద్ద కుమారుడు యాత్ర, రెండవ కుమారుడు లింగను తీసుకుని రాగా.. ఈ ఫంక్షన్ కు వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ధనుష్ పెద్ద కొడుకు గురించి ఈవెంట్ అంతా హాట్ టాపిక్ నడిచింది.
ధనుష్-ఐశ్వర్యల పెద్ద కొడుకు యాత్ర అచ్చు గుద్దినట్లు ధనుష్లాగే ఉండడంతో అతన్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలోనే ధనుష్ కొడుకు యాత్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఉపందుకుంది. తన తండ్రి లాగే హ్యాండ్సమ్ లుక్స్ తో ఉన్న యాత్రను చూసిన ఫ్యాన్స్ అతను హీరోగా ఎంట్రీ ఇస్తే తండ్రిని మించిన తనయుడు అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ధనుష్ కూడా సేమ్ ఇదే టైమ్ లో అంటే చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు యాత్ర కూడా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. యాత్ర కి తన తండ్రి క్రేజ్ తో పాటూ తాత సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ డమ్ కూడా ఉంది. ఈ రెండు ఇమేజ్ లను కాపాడుకుంటూ ముందుకెళ్లాలంటే అది సాధారణ విషయం కాదు.
ఏదేమైనా రూపంలో తండ్రిలాగే ఉన్న యాత్ర నటన నైపుణ్యం లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడేమో చూడాలి. ఇక లాల్ సలామ్ సినిమా విషయానికొస్తే.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రజనీకాంత్ గెస్ట్ రోల్లో చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.