స‌హ‌న‌టి విష‌యంలో హీరో నిజాయితీపై ప్ర‌శంస‌లు

జాన్వీ క‌పూర్ తో వృత్తిగ‌త విష‌యాలు మాత్ర‌మే మాట్లాడాన‌ని గుల్ష‌న్ వెల్ల‌డించారు. జాన్వీ మంచి న‌టి. ప్రొఫెష‌న‌ల్ గా ఉంటుంద‌ని ప్ర‌శంసించాడు.

Update: 2024-07-23 04:46 GMT

బాలీవుడ్ యువ‌నటుడు గుల్షన్ దేవయ్య 'ఉలాజ్‌'లో జాన్వీ కపూర్‌తో పాటు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ ఇప్ప‌టికే వైర‌ల్ గా దూసుకెళ్లింది ఇటీవలి ఇంటర్వ్యూలో దేవ‌య్య త‌న స‌హ‌న‌టి జాన్వీ కపూర్‌తో త‌న‌కు స్నేహం లేద‌ని వెల్లడించాడు. మేం క‌లిసి ప‌ని చేసాం కానీ, స్నేహాన్ని కొన‌సాగించ‌లేద‌ని చెప్పాడు.

గుల్షన్ ది ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ''మేము నిజంగా ప్రకంపనలు కోరుకోలేదు. మీరు ఊహించుకున్న‌ట్టు మేము కూర్చొని కబుర్లు చెప్పుకునే టైప్ కాదు. వాస్తవానికి మేము అస్సలు ప్రకంపనల కోసం పాకులాడ‌ము. నాకు తెలియదు .. జాన్వీ నన్ను ఫన్నీగా, ఆసక్తికరంగా చూస్తుందని అనుకోను'' అని అన్నారు. ఇతర నటీనటులతో స్నేహంగా ఉండొచ్చు.. కానీ అంద‌రితోను అదే విధంగా తప్పనిసరిగా స్నేహితులు కావాల‌నేం లేదు. గ‌తంలో రాధిక ఆప్టే, సోనాక్షి సిన్హా వంటి వారితో స్నేహంగా ఉన్నాను. వారితో అన్ని విష‌యాలు మాట్లాడేవాడిని. కానీ జాన్వీతో స్నేహంగా లేను. వృత్తిగ‌తంగా మాత్ర‌మే మేం చ‌ర్చించుకునేవాళ్లం అని దేవ‌య్య తెలిపాడు. స్నేహంగా లేనంత మాత్రాన‌ మాకు సన్నివేశాలు చేయడంలో ఆటంకం కలుగుతోందని నేను ఎప్పుడూ భావించలేదు.. లోటు ఉంద‌ని అనుకోలేదు అని అన్నారు.

సెట్లో త‌మ మ‌ధ్య అన‌వ‌స‌ర‌మైన జోకులు వంటివి కూడా లేవ‌ని గుల్ష‌న్ దేవ‌య్య అన్నాడు. అయితే అత‌డిపై నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేసారు. దానికి స‌మాధానంగా ఇప్పుడు అత‌డు వివ‌ర‌ణ ఇచ్చాడు. నేను జాన్వీక‌పూర్ తో స్నేహంగా లేన‌ని అన్నాను కానీ త‌ప్పుగా మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్ఠ‌తనిచ్చాడు. జాన్వీ క‌పూర్ తో వృత్తిగ‌త విష‌యాలు మాత్ర‌మే మాట్లాడాన‌ని గుల్ష‌న్ వెల్ల‌డించారు. జాన్వీ మంచి న‌టి. ప్రొఫెష‌న‌ల్ గా ఉంటుంద‌ని ప్ర‌శంసించాడు.

అత‌డి నిజాయితీన నెటిజన్లు కొనియాడారు. అతడి సన్నిహితుడు, నటుడు విజయ్ వర్మ ఇలా రాసాడు. ''జర్నలిస్టులు మేం ఒక కుటుంబంలా ఉన్నాము... అనే కథనాన్ని వినడానికి మాత్రమే శిక్షణ పొందారని, దానికోసం మాత్ర‌మే సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. వారికి శిక్షణ అవసరం. తు మస్త్ ఆద్మీ హై రే గుల్లు ప్రతిభతో పాటు మంచి వ్య‌క్తిత్వం ఉన్న‌వాడివి.. నీవు అంత తేలికగా భయపడవ‌ని నాకు తెలుసు'' అని ప్ర‌శంసించారు.

నాకు అర్థమైంది.. సినిమా సెట్ వారికి మరొక వ‌ర్క్ ప్లేస్ అయినప్పుడు కోస్టార్లు బిఎఫ్‌ఎఫ్‌ల వలె ఎందుకు ప్రవర్తించాలని మేము ఆశిస్తున్నాము? వారు ఒకరినొకరు ఇష్టపడాల్సిన అవసరం లేదు. వారు నటించగలగాలి. వారు కలిసి పని చేస్తున్నప్పుడు వృత్తిగ‌తంగానే ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మ‌రొక నెటిజ‌న్. అత‌డిలో చాలా నిజాయితీ ఉంద‌ని కూడా ప‌లువురు ప్ర‌శంసించారు.

Tags:    

Similar News