అల్లు అర్జున్ మంచితనం గురించి గుణశేఖర్..!
అల్లు అర్జున్ గురించి గుణశేఖర్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పుష్ప 2 సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షో లో పాల్గొన్నారు. గతంలోనూ ఒక సారి అల్లు అర్జున్ బాలయ్య షోకి వెళ్లడం జరిగింది. గతంతో పోల్చితే ఈసారి ఎపిసోడ్‌ను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయాలనే ఉద్దేశ్యంతో బన్నీతో వర్క్ చేసిన దర్శకులతో వీడియో బైట్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ మదర్ సైతం వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్‌కి మంచి స్పందన దక్కుతోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో పాటు పలువురిపై తన అభిప్రాయాలను బన్నీ చెప్పిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ షోకి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ షోలో అల్లు అర్జున్ గురించి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, గుణశేఖర్, దిల్ రాజులు మాట్లాడిన వీడియో బైట్లు చూపించడం జరిగింది. అల్లు అర్జున్ గురించి గుణశేఖర్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కష్టాల్లో ఉన్నాను అనే విషయం తెలుసుకుని మరీ సాయం చేసేందుకు స్వయంగా ఫోన్ చేసిన గొప్ప మనిషి అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చారు. గుణశేఖర్ మాటలను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తూ మంచి మనసున్న అల్లు అర్జున్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తనకు చేసిన సాయం గురించి ఎప్పటికీ మరచి పోలేను అంటూ గుణశేఖర్ తన అభిమానంను చాటుకున్నారు.
ఇంకా గుణశేఖర్ మాట్లాడుతూ... వరుడు సినిమాతో బన్నీకి తాను ఫ్లాప్ ఇచ్చినా 'రుద్రమదేవి' సినిమా చేస్తున్న సమయంలో స్వయంగా ఫోన్ చేసి మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను, ఏదైనా క్యారెక్టర్ చేస్తాను మీకు సపోర్ట్ అవుతుందని అన్నారు. అలా గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చేశారు. రుద్రమదేవి మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవడంతో పాటు గోన గన్నారెడ్డి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ లుక్‌తో పాటు డైలాగ్స్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. రుద్రమదేవి విజయంలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర కీలక భూమిక పోషించింది అనడంలో సందేహం లేదు.
గుణశేఖర్ మాటలకు అల్లు అర్జున్ స్పందిస్తూ... వరుడు సినిమాను ఆయన చాలా జెన్యూన్‌గా చేశారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్‌తో రుద్రమదేవి సినిమాను చేస్తున్నట్లుగా తెలిసింది. షూట్ అంతా పూర్తి అయినా ఒక పాత్ర కోసం హీరో కావాలని వెతుకుతున్నారని తెలిసి ఆ పాత్రను తాను చేసేందుకు ఆయనకు నేను ఫోన్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడిని గుర్తు పెట్టుకుని ఆయన సినిమా కష్టాల్లో ఉంటే సాయం చేసేందుకు ముందుకు రావడం గొప్ప విషయం కదా అంటూ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.