గుంటూరు కారం సెన్సార్ పూర్తి

సెన్సార్ నుండి ఈ చిత్రానికి యు బై ఏ (U/A) సర్టిఫికేట్ జారీ అయింది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉన్న‌ట్లు తెలుస్తుంది.

Update: 2024-01-04 14:37 GMT

సూపర్ స్టార్ మహేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుత్నోన్న మాస్ ఎంట‌ర్ టైన‌ర్ 'గుంటూరు కారం' పై అంచ‌నాలు ఇప్ప‌టికే పీక్స్ కి చేరాయి. మ‌హేష్ అన్న ఖాతాలో మ‌రో మాస్ హిట్ ఖాయ‌మంటూ అభిమానులు రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. సూప‌ర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చే ముందు ఊర‌మాస్ హిట్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఊపేస్తారు! అన్న అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి.


అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌చార చిత్రాలు క‌నిపిస్తున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. కానీ ఈ రేసులో చాలా సినిమాలు ఉండ‌టంతో ఒక‌వేళ వాయిదా ప‌డుతుందా? అన్న సందేహం ఓవైపు ఉండేది. కానీ ఆ ఛాన్సే లేదంటూ తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌వ్వ‌డంతో రిలీజ్ తేలిపోయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెన్సార్ నుండి ఈ చిత్రానికి యు బై ఏ (U/A) సర్టిఫికేట్ జారీ అయింది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉన్న‌ట్లు తెలుస్తుంది. సెన్సార్ టాక్ విన్న తర్వాత నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా టాక్ ఎలా ఉంటుంద నేది తెలియజేశారు. 'చూడగానే మజా వస్తుంది.. హార్ట్ బీట్ పెరుగుతుంది.. ఈల వేయాలి అనిపిస్తుంది' అని ట్వీట్ చేసారు. అంతేకాదు నేను చెప్పిన ఈ మాట.. అలాగే ఈ డేట్‌ని గుర్తు పెట్టుకోండి అంటూ చాలా ధీమాగా వ్య‌క్తం చేసారు.

నిర్మాత న‌మ్మ‌కం చూస్తుంటే బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. మ‌రి అంతిమంగా నిర్ణ‌యించాల్సింది ప్రేక్ష‌కులు కాబ‌ట్టి జ‌న‌వ‌రి 12వ‌ర‌కూ ఆగాల్సిందే. ఈ సినిమాలో మ‌హేష్ కి జోడీగా శ్రీలీల.. మీనాక్షి చౌదరి న‌టిస్తున్నారు. రమ్య కృష్ణ.. ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖ నటీనటులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Tags:    

Similar News