మహేష్ స్థాయి ఏంటి? ఆ కుర్చీ రోత ఏంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ఫాన్స్ అయితే ఎంతో సంబరపడ్డారు.

Update: 2023-12-29 17:30 GMT
మహేష్ స్థాయి ఏంటి? ఆ కుర్చీ రోత ఏంటి?
  • whatsapp icon

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ఫాన్స్ అయితే ఎంతో సంబరపడ్డారు. అతడు సినిమాతో టాలీవుడ్ కు సరికొత్త స్క్రీన్ ప్లే చూపించిన త్రివిక్రమ్ ఆ తర్వాత ఖలేజా సినిమాతో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ అయితే అసలు తగ్గలేదు.

ఇక మొత్తానికి మూడవ సినిమా గుంటూరు కారంతో ఈసారి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అని ఫాన్స్ అయితే ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటి వస్తున్న తర్వాత ఆ కాంబినేషన్ పై ఉన్న హైప్ అయితే మెల్లగా తగ్గిపోతోంది అనే తరహాలో కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అసలు త్రివిక్రమ్ కూడా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా చేస్తున్నాడా అనే తరహాలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దానికి తోడు తమ థమన్ సంగీతం కూడా మరింత ట్రోల్స్ కు దారితీస్తోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. అవి పర్వాలేదు కానీ ఈసారి మూడో సాంగ్ విడుదల చేయడంతో ఓ వర్గం ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగానే హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు మహేష్ బాబు స్థాయికి తగ్గ పాట ఇది కాదు అని, కుర్చీ మడత పెట్టి.. అనే డైలాగ్ తో పాటలు క్రియేట్ చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా ఆ డైలాగ్ లో ఒక బూతు కూడా హైలెట్ అయిన విషయం తెలిసిందే. దాన్ని తీసుకువచ్చి క్లాస్ హీరో అయినటువంటి మహేష్ బాబుకు ఎలా మ్యాచ్ చేయాలి అనిపించింది అని చిత్ర యూనిట్ పై గట్టిగానే కౌంటర్లు వేస్తూ ఉన్నారు. కొత్తగా ఏదైనా చేస్తారేమో అనుకుంటే సోషల్ మీడియాలో ఉన్న స్టఫ్ నే ఆమ్లెట్ల తిప్పేశారు. అసలు సూపర్ స్టార్ హోదా ఉన్న మహేష్ బాబుకు ఈ పాట ఏ మాత్రం సెట్ కాలేదు అని అంటున్నారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి కెసిపిడి అనే డైలాగ్ ను వాల్తేరు వీరయ్య లో వాడారు. అలాగే బాలకృష్ణ భగవంథ్ కేసరిలో కూడా హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ తో.. కుర్చీని మడతపెట్టి అంటూ మరొక ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఒకప్పుడు సినిమా చుట్టూ సోషల్ మీడియా తిరిగేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి అనేలా ఈ పాట ఆలోచనలు కలిగిస్తోంది. సోషల్ మీడియా ట్రెండును ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు కానీ దేన్ని పడితే దాన్ని తీసుకోవద్దు అని ఇలా కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయినా త్రివిక్రమ్ మహేష్ బాబుకు ఇంత తక్కువ స్థాయిలో పాటలను కంపోజ్ చేయించడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు కౌంటర్లకు చిత్ర యూనిట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News