దీపావళి.. అసలైన విన్నర్ ఆయనే..

అయితే ఆ మూడు సినిమాల్లో దీపావళి విజేత ఏదన్న విషయం పక్కన పెడితే.. అసలైన విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అని చెబుతున్నారు నెటిజన్లు.

Update: 2024-11-03 16:30 GMT

దివ్వెల పండుగ దీపావళి కానుకగా థియేటర్లలో పలు సినిమాలు వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివకార్తికేయన్- సాయి పల్లవి అమరన్ తో పాటు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో క, లక్కీ భాస్కర్, అమరన్ మూవీస్.. ఆడియన్స్ ను మెప్పిస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

అయితే ఆ మూడు సినిమాల్లో దీపావళి విజేత ఏదన్న విషయం పక్కన పెడితే.. అసలైన విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అని చెబుతున్నారు నెటిజన్లు. దివాళీకి డబుల్ బొనాంజా కొట్టేశారని అంటున్నారు. దీపావళికి వచ్చి సూపర్ హిట్ అయిన మూడు సినిమాల్లో రెండింటికి ఆయనే సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. తన టాలెంట్ తో ప్రశంసలు అందుకున్నారు. ఒకేసారి రెండు హిట్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.

ఆ విషయాన్ని జీవీ ప్రకాష్ కుమార్ కూడా రీసెంట్ గా నెటిజన్లతో పంచుకున్నారు. "అమరన్, లక్కీ భాస్కర్.. రెండు రాష్ట్రాలు.. రెండు బ్లాక్ బస్టర్స్.. నా వర్క్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్ చేశారు జీవీ ప్రకాష్ కుమార్. ఇప్పుడు ఆయన కోసమే నెట్టింట చర్చ నడుస్తోంది. అదే దూకుడును కంటిన్యూ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. మరిన్ని హిట్స్ ను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

అయితే లక్కీ భాస్కర్ సినిమాకు గాను జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి ప్రశంసలు వచ్చాయి. రెట్రో బ్యాక్ డ్రాప్ తగ్గట్టు ఆయన అవుట్ పుట్ అందించారని అనేక మంది మెచ్చుకున్నారు. సాంగ్స్ అంత ఎఫెక్ట్ చూపించలేకపోయినా.. వింటూ ఉంటే ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. మరోవైపు, అమరన్ కు గాను జీవీ వర్క్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. ఆడియన్స్ కు సినిమాతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా కనెక్ట్ చేసేశారు.

అమరన్ స్టోరీకి తగ్గట్టు సరైన రీతిలో స్కోర్ అందించి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే పలు సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. ఇప్పుడు మరింత ఫేమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ మట్కా, నితిన్ రాబిన్ హుడ్, సూర్య 43 ప్రాజెక్ట్, విక్రమ్ వీర ధీర శూరన్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News