అతడితో ఎఫైర్ అంటగట్టి గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు!
సంగీత దర్శకుడు జీ.వి ప్రకాష్ కుమార్-గాయని సైంధవి దంపతులు వివాహాబంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.;

సంగీత దర్శకుడు జీ.వి ప్రకాష్ కుమార్-గాయని సైంధవి దంపతులు వివాహాబంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడి పోతున్నట్లు వెల్లడించారు. కోర్టు నుంచి విడాకులు మంజూరు కావాల్సి ఉంది. అయితే జీవీ దంపతులు విడిపోవడానికి కారకురాలుగా నటి దివ్యభారతి పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
జీవి-దివ్య భారతి మధ్య ఉన్న రిలేషన్ కారణంగానే భార్యాభర్తల మధ్య సంబంధం చెడిపోయిందని..జీవీ ఆ కారణంగానే విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై దివ్యభారతి స్పం దించింది. చాలా మంది ఆడవాళ్లు తనని తిడుతూ మెసేజ్ లు పెడుతున్నారని వాపోయింది. జీవికి.. తనకి ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పినా నమ్మడం లేదని వాపోయింది. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని జీవి తనతో చెప్పాడని..కెరీర్ పైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చినట్లు తెలిపింది.
తాము ఇద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని తెలిపింది. తప్పు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బ తీయాలని కొందరు చేస్తోన్న ప్రయత్నంగా ఇది కనిపిస్తుందని ఆరోపించింది. అలాగే జీవీ కూడా ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఖండించాడు. తమ మధ్య కేవలం స్నేహం తప్ప ఎలాంటి రిలేషన్ షిప్ లేదని లేనిపోని అవాస్తవాలు రాయోద్దని విజ్ఞప్తి చేసాడు. జీవి-దివ్యభారతి ఇటీవల రిలీజ్ అయిన `కింగ్ స్టన్` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇద్దరు కలిసి నటించడం ఇది రెండవ సారి. తొలిసారి ఇరువురు `బ్యాచిలర్` అనే సినిమాలో కలిసి నటిం చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. `కింగ్ స్టన్` రిలీజ్ కు వచ్చే సరికి స్నేహం అనే ప్రచారం రిలేషన్ షిప్ లా మారిపోయింది. ఇదే సమయంలో జీవీ జోడీ విడాకులకు అప్లై చేయడంతో? ప్రచారం పీక్స్ కి చేరింది.