.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

T20 WC విజయం తర్వాత న‌టాషాకు హార్దిక్ కాల్?

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్థిక్ మెడలో విజేత మెడల్‌తో పిచ్‌పై కూర్చుని ఫోన్ కాల్‌లో డీప్ గా మునిగిపోయాడు.

Update: 2024-06-30 09:27 GMT

హార్డిక్ పాండ్యా -నటాషా స్టాంకోవిచ్ జంట విడిపోతోందంటూ ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. 2024 T20 ప్రపంచ కప్ ప్రారంభమైనప్పటి నుండి విడాకుల పుకార్లు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసాయి. ఈ జంట పుకార్ల గురించి గట్టిగా పెదవి విప్పనప్పటికీ నటాషా సోష‌ల్ మీడియా పోస్టులు అస‌లు గుట్టు విప్పాయి. తనకు - హార్దిక్‌కి మధ్య అన్నీ బాగా లేవని సూచించే రహస్య పోస్ట్‌లను ఆమె షేర్ చేసారు. అయితే, T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలిచాక (భారతదేశం దక్షిణాఫ్రికాను ఓడించిన తర్వాత) హార్దిక్‌ ఫోన్ కాల్‌లో త‌న భార్య‌తో మాట్లాడుతున్న ఓ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా మారింది. ఇప్పుడు అంతా స‌ర్ధుకుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్థిక్ మెడలో విజేత మెడల్‌తో పిచ్‌పై కూర్చుని ఫోన్ కాల్‌లో డీప్ గా మునిగిపోయాడు. పాండ్యా అవతలి వైపు ఉన్న వారితో యానిమేషన్ బొమ్మ‌లాగా ఉండిపోయి మాట్లాడుతున్నాడు. అది నటాషాతోనే అని అభిమానులు భావిస్తున్నారు.

నటాషా స్టాంకోవిక్‌కి హార్దిక్ పాండ్యా 2020 మేలో కరోనావైరస్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లాడాడు. అగస్త్య పాండ్యా అనే 3 ఏళ్ల బాలుడికి తల్లిదండ్రులయ్యారు. మోడల్ కం న‌టి న‌టాషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి `పాండ్యా` ఇంటిపేరును తొలగించినట్లు నెటిజనులు గమనించిన తర్వాత బ్రేక‌ప్‌ పుకార్లు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి.

Read more!

అయితే ఈ నెల ప్రారంభంలో నటాషా -హార్దిక్ విడిపోయారా? అనే రెడ్డిట్ పోస్ట్ తర్వాత ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. వైరల్ అయింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం లేదని ఈ పోస్ట్ పేర్కొంది. IPL 2024 మ్యాచ్‌లకు నటాషా గైర్హాజరు కావడాన్ని ప్రశ్నించారు. ఇన్ స్టాలో న‌టాషా త‌న పేరు నుంచి పాండ్యా పేరును తొల‌గించ‌డంతో బోలెడ‌న్ని సందేహాలు మొద‌ల‌య్యాయి. అలాగే న‌టాషా పుట్టినరోజు మార్చి 4 న‌ హార్దిక్ నుండి ఎటువంటి పోస్ట్ చేయ‌ లేదు. ఇది కూడా చాలా సందేహాల‌కు దారి తీసింది. గ‌త ఆరు నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్యా స‌ఖ్య‌త చెడిపోయింద‌నే క‌థ‌నాలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News