హార్థిక్-నటాషా మళ్లీ కలిసిపోతారు!
అతడు అనవసరమైన ఎమోషనల్ పోస్ట్ లు చేయడం లేదు.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో జూనియర్ పాండ్యా (కుమారుడు అగస్త్య) సెర్బియాలోని డైనోసార్ థీమ్ పార్క్‌లో ఆటలు ఆడుకుంటూ ఆనందంగా కనిపించాడు. ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటోలపై ఇంతటి ఎమోషనల్ మూవ్ మెంట్ లోను హార్దిక్ సాధారణంగా స్పందిస్తున్నారు. అతడు అనవసరమైన ఎమోషనల్ పోస్ట్ లు చేయడం లేదు. దీంతో వారి మధ్య పూర్తిగా చెడలేదని చాలా మంది భావిస్తున్నారు.
సోషల్ మీడియాల్లో అభిమానుల స్పందనలు పరిశీలిస్తే... వీరిలో కొందరు హార్దిక్ -నటాషా స్నేహపూర్వకంగా ఉన్నారని భావిస్తున్నారు. ''వారు స్నేహపూర్వకంగా ఉన్నట్లు అనిపిస్తుంది'' అని ఒక నెటిజన్ రాయగా, ''వారు త్వరలో అన్ని విషయాలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను'' అని మరొకరు వ్యాఖ్యానించారు.
నటాసా పోస్ట్‌పై హార్దిక్ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. తమ కుమారుడి ఫోటోలను నటాషా షేర్ చేయగానే.. హార్దిక్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చాడు. బ్యాడ్ ఐ- హార్ట్- ఓకే హ్యాండ్ ఈమోజీలను షేర్ చేసి... పోస్ట్ కింద గుండె ఈమోజీని కూడా షేర్ చేసాడు. హార్దిక్ పోస్ట్ లో నటాషాపై ద్వేషాన్ని చూపకపవడంతో అభిమానులు థ్రిల్ అయ్యారు. కొందరు వారిని మళ్లీ కలిసిపోవాలని కూడా కోరారు. మీరిద్దరూ విడాకులు తీసుకోరు! అని ఒక అభిమాని రాశాడు. బ్రో తిరిగి కలవండి బ్రో అని మరొకరు రాసారు. చాలామంది అతడి పోస్ట్‌ల క్రింద హార్ట్ బ్రేక్ ఎమోజీలతో కామెంట్ చేశారు.
హార్థిక్ నుంచి విడిపోతున్నట్లు నటాషా ప్రకటించడానికి ముందు నుండి ఆన్లైన్లో ద్వేషాన్ని ఎదుర్కొంటున్న సమయంలో హార్దిక్ తనకు మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ఆన్లైన్లో పుకార్లు వచ్చినప్పుడు నటాషా స్త్రీద్వేషాన్ని, అనవసరమైన ఆగ్రహాలను ఎదుర్కొంది. ప్రజలు తనను రకరకాలుగా కామెంట్లు చేసారు. ఒక అభిమాని నటాషాకు మద్ధతుగా నిలుస్తూ ''ఆమె గురించి ద్వేషాన్ని పెంచడం ఆపండి. హార్దిక్ కూడా ఎలాంటి ద్వేషాన్ని ప్రదర్శించడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. విడిపోవడం వారి వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి అందులోకి రావద్దు'' అని రాసారు.
విడాకుల ప్రకటనకు వారం ముందు అగస్త్యతో ముంబై నుండి సెర్బియాకు బయలుదేరారు నటాషా. అనంతరం సోషల్ మీడియాలో విడాకులను ధృవీకరించారు. నటాషా- హార్దిక్ 31 మే 2020న వివాహం చేసుకున్నారు. వారు ఫిబ్రవరి 2023లో తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. జూలై 2024లో విడిపోయారు.