వీర‌మ‌ల్లు పెండింగ్ ని అలా మ్యానేజ్ చేస్తారా?

అభిమానుల పెట్టుకున్న అంచ‌నాల్ని జ్యోతికృష్ణ ఎంత‌వ‌ర‌కూ న్యాయం చేస్తాడు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలుతుంది.

Update: 2024-05-29 12:46 GMT

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప్రాజెక్ట్ నుంచి ద‌ర్శ‌కుడిగా క్రిష్ ఎగ్జిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్థానంలో నిర్మాత ఏఎం ర‌త్నం త‌న‌యుడు జ్యోతికృష్ణ వ‌చ్చాడు. క్రిష్ ఎంత‌వ‌ర‌కూ పూర్తి చేసాడో? అక్క‌డ నుంచి కొన‌సాగింపు పూర్తి చేయాల్సిన బాధ్య‌త జ్యోతికృష్ణ‌పై ఉంది. మ‌రి ఈ ప్రాజెక్ట్ విష‌యంలో అత‌డి టేకింగ్ ఎలా ఉంటుంది? అభిమానుల పెట్టుకున్న అంచ‌నాల్ని జ్యోతికృష్ణ ఎంత‌వ‌ర‌కూ న్యాయం చేస్తాడు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలుతుంది. అంత‌వ‌ర‌కూ అంతా సైలెంట్ గా ఉండ‌టం త‌ప్ప చేసేదేం లేదు.

అయితే ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు త‌ప్పుకున్నాడు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. త‌న స‌మ‌యం వృద్ధా అయిపోతుంద‌ని వ‌దిలేసాడా? లేక ఏవైనా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయా? అన్న‌ది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత జ్యోతికృష్ణ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అంద‌రికీ స‌ర్దుబాటు కావాల‌నే క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వ‌చ్చాడ‌న్నారు. ఈ క‌థ ముందు నుంచి జ్యోతికి తెలుస‌ని, ద‌ర్శ‌కుడిగా త‌న‌కు అనుభ‌వం ఉంద‌ని, పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వు అన్న ధీమాని వ్య‌క్తం చేసారు.

అలాగే ద‌ర్శ‌కుడిగా త‌న‌కున్న అనుభ‌వం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుభ‌వ రంగ‌రించి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామ‌న్నారు. జ్యోతికృష్ణ అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు త‌మ ఇద్ద‌రి ద‌గ్గ‌ర నుంచి తీసుకుంటాడ‌న్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది ఈ ముగ్గురు పేరున్న ద‌ర్శ‌కులైతే కాదు. ర‌త్నం కు పెద్ద‌రికం ఒక్క‌టే చెప్పుకోద‌గ్గ సినిమా. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జానీ' త‌ర్వాత మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్క‌లేదు. జ్యోతి కృష్ణ ఐదారు సినిమాలు తెర‌కెక్కించాడు. ఈ నేప‌థ్యంలో సోషియా ఫాంట‌సీ చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కోసం ఆ ముగ్గురు ఎంత వ‌ర‌కూ న్యాయం చేస్తారో చూడాలి.

పైగా ఇది రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే ఏడాది మొద‌టి భాగం రిలీజ్ చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. మ‌రోవైపు ఓజీ స‌హా పీకే పూర్తి చేయాల్సిన క‌మిట్ మెంట్లు కొన్ని ఉన్నాయి. వాట‌న్నింటిని బ్యాలెన్స్ చేస్తూ పీకే ఈ సినిమాకి డేట్టు కేటాయించాల్సి ఉంది.

Tags:    

Similar News