బాలయ్య కోసం స్ట్రాంగ్ కేరెక్టర్ డిజైన్ చేశారట హరీష్ !
ఇందు కోసం ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో స్టోరీని లాక్ చేసిన హరీష్ ఈ కథ కోసం నందమూరి బాలకృష్ణని ఎంచుకున్నట్టగా తెలుస్తోంది.;

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో `గబ్బర్‌సింగ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా తరువాత మళ్లీ మరోసారి పవన్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకు `తేరి` రీమేకు తెలుగులో భారీ మార్పులు చేర్పులు చేసి `ఉస్తాద్ భగత్‌సింగ్` పేరుతో రీమేక్ చేయడం మొదలు పెట్టాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా మందుకు సాగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించలేకపోతున్నారు.
దీంతో దర్శకుడు హరీష్ శంకర్‌కు పని లేకుండా పోయింది. పవన్ కోసం ఎదురు చూసి ఏళ్లు గడుస్తున్నా పిలుపు రాకపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లే అవకాశం లేదని హరీష్ శంకర్ ఓ క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉన్న కెరీర్‌ని, టైమ్‌ని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేని ఆయన తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇందు కోసం ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో స్టోరీని లాక్ చేసిన హరీష్ ఈ కథ కోసం నందమూరి బాలకృష్ణని ఎంచుకున్నట్టగా తెలుస్తోంది.
ఇప్పటికే ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామా చేయడానికి సిద్ధమైన హరీష్ శంకర్ దీనితో పాటు నందమూరి బాలకృష్ణతోనూ ఓ పవర్ ఫుల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్యతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాని కన్నడ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.
ఈ సంస్థ ప్రస్తుతం దళపతి విజయ్‌తో `జన నాయగన్`, రాకింగ్ స్టార్ యష్‌తో `టాక్సిక్`, కార్తితో `ఖైదీ 2` చిత్రాలని నిర్మిస్తోంది. వీటితో పాటు బాలకృష్ణ - హరీష్ శంకర్‌ల ప్రాజెక్ట్‌ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతోంది. క్యారెక్టర్ డ్రైవెన్ ఫిల్మ్‌గా తెరపైకి రానున్న ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. తొలిసారి హరీష్ - బాలయ్యల కలయికలో రానున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండనుందన్నది తెలియాలంటే మబరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.