గబ్బర్ సింగ్ డైరెక్టర్ పెద్ద స్కెచ్..!

టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టర్ బచ్చన్ ప్రయత్నం ఫెయిల్ అయ్యింది.;

Update: 2025-04-07 17:13 GMT
గబ్బర్ సింగ్ డైరెక్టర్ పెద్ద స్కెచ్..!

టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టర్ బచ్చన్ ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. అయితే ఆ సినిమాతో టాలీవుడ్ కి ఒక టాలెంటెడ్ హీరోయిన్ ని పరిచయం చేశాడు హరీష్ శంకర్. భాగ్య శ్రీ బోర్స్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఐతే తొలి సినిమా ఛాన్స్ ఇచ్చి ఆమె ఫేట్ మార్చేశాడు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ గత 3 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి పనిచేస్తూనే ఉన్నాడు.

మధ్యలో ఒక నాలుగైదు నెలలు గ్యాప్ తీసుకుని మిస్టర్ బచ్చన్ చేశాడు. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ ఇంకాస్త టైం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే లైన్ లో హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు పూర్తైతే కానీ ఉస్తాద్ కి ఛాన్స్ లేదు. అందుకే హరీష్ శంకర్ కూడా ఇక ఇలానే ఉంటే కష్టమని తను కూడా వేరే ప్రాజెక్ట్ లు చేయాలని ఫిక్స్ అయ్యాడట.

ఈ క్రమంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక ప్రాజెక్ట్ నెక్స్ట్ బాలకృష్ణతో మరో ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడట. బాలయ్యతో సినిమా కాస్త టైం పట్టొచ్చేమో కానీ రామ్ తో సినిమా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. రామ్ ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రాం హరీష్ శంకర్ సినిమా ఉంటుందని టాక్.

ఐతే రామ్, బాలకృష్ణ సినిమాల కథలను పూర్తి చేసేందుకు హరీష్ శంకర్ సెపరేట్ సెటప్ చేసుకున్నాడట. పూరీ తన సినిమా కథను బ్యాంకాక్ వెళ్లి రాసినట్టుగా హరీష్ శంకర్ తన టీం తో కూర్గ్ వెళ్లి స్క్రిప్ట్ పనులు చూస్తున్నారట. అక్కడే తన టీం తో కలిసి స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది.

హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. ఐతే ఈసారి సొంత కథలతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. రాం, బాలకృష్ణ ఈ రెండు ప్రాజెక్ట్ ల మీద భారీ హైప్ వచ్చేలా ఉంది. రామ్ తో సినిమా త్వరగానే మొదలు పెట్టేలా ప్లానింగ్ లో ఉన్న హరీష్ శంకర్ ఆ సినిమాతో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాల బ్యాక్ డ్రాప్ ఏంటి ఏ రేంజ్ లో ఈ సినిమాలు వస్తాయన్నది చూడాలి.

Tags:    

Similar News