ఉస్తాద్ విషయంలో అనుకున్నదే జరిగిందా..?

ఇక సినిమా మొదలు పెట్టి ముందు దానికి భవధీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టి దాన్ని కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.;

Update: 2025-03-25 19:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో అంటే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. ఇద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఐతే మళ్లీ ఈ కలయికలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా ఇద్దరు కలిసి కోలీవుడ్ తెరి సినిమా మూల కథ తీసుకుని దాన్ని పూర్తిగా కొత్త ట్రీట్ మెంట్ తో కథ రాసుకున్నారు. ఇక సినిమా మొదలు పెట్టి ముందు దానికి భవధీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టి దాన్ని కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.

ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ కేవలం తక్కువ రోజుల షూటింగే చేశాడని తెలుస్తుంది. హరీష్ శంకర్ పవన్ ఇచ్చిన తక్కువ డేట్స్ లోనే సినిమా షూట్ చేశాడు. అందులో భాగంగానే ఎన్నికల టైం లో టీజర్ ని కూడా వదిలారు. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చింది. సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అనుకున్నారు.

కానీ సినిమాకు పవన్ టైం ఇవ్వలేకపోవడం. దీని కన్నా ముందు పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలు కూడా లైన్ లో ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ వెనకపడుతూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వీరమల్లు తో పాటు ఓజీ కూడా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తయ్యాకే ఉస్తాద్ కి టైం ఇవ్వాల్సి ఉంది. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ వి దాదాపు రెండు నెలల పైన డేట్స్ కావాలట.

ఇప్పుడున్న ఈ బిజీ టైం లో పవన్ ఆ డేట్స్ ఇవ్వడం చాలా కష్టం. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని కొందరు అంటున్నారు. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి చేసి విసిగిపోయి ఉన్నాడు. త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది.

హరీష్ శంకర్ లిస్ట్ లో రాం, బాలకృష్ణ ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు ఎవరు తర్వాత అన్నది తెలియదు కానీ మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఇన్నాళ్లు తన టైం వేస్ట్ చేసుకున్న హరీష్ శంకర్ ఇక మీదట అయినా స్పీడ్ పెంచితే బెటర్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News