మైత్రీ నిర్మాతపై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
టాలీవుడ్ లో ఉన్నటాప్ నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. వారి బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారెంటీ అనే స్థాయిలో దానిపై నమ్మకం ఏర్పడింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
తక్కువ కాలంలోనే మైత్రీ సంస్థ మంచి బ్యానర్ గా పేరు తెచ్చుకుంది. మంచి కథలను పట్టుకుని వాటితో సినిమాలను నిర్మిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని మంచి పేరు సంపాదించుకున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచినా మైత్రీ బ్యానర్ లో వచ్చిన సినిమాలకు సక్సెస్ రేటే ఎక్కువ.
రీసెంట్ గా పుష్ప2 తో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సినీ నిర్మాణంలోనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తుంది. తెలుగు సినిమా స్థాయిని అంతటా విస్తరింపచేయాలనే ఆలోచనతో తెలుగు దర్శకులను బాలీవుడ్ కు పరిచయం చేస్తూ, బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు మైత్రీ నిర్మాతలు.
ఏదైనా హిట్ మూవీ వచ్చి డైరెక్టర్ లో మ్యాటర్ ఉందనుకుంటే వారికి ముందుగా చెక్ వెళ్లేది మైత్రీ నుంచే. ప్రతీ ఆర్టిస్ట్ మైత్రీ లాంటి సంస్థలో పనిచేయాలని కోరుకునే రేంజ్ కు అతి తక్కువ కాలంలోనే ఆ నిర్మాణ సంస్థ చేరింది. నిర్మాతలకు సినిమాపై ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇంత సక్సెస్ అవలేరు. రీసెంట్ గా మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో రవి గారు ఎప్పుడూ ముందుంటారని, ఏదైనా సినిమా చూసి ఫలానా ఆర్టిస్ట్ బాగా చేశారని తాను చెప్పే లోపు ఆల్రెడీ చెక్ వెళ్లిపోయిందని చెప్తుంటారని, దేవర సినిమాలో ఎన్టీఆర్ పడవ వేసుకుని వేటకు వెళ్లినట్టు ప్రతి శుక్రవారం రవి గారు టాలెంట్ హంట్ కు వెళ్తారని హరీష్ అన్నాడు. హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్‌సింగ్ కు కమిట్ అయిన విషయం తెలిసిందే.