మిస్టర్ బచ్చన్ టాక్.. హరీష్ శంకర్ ఏమన్నాడంటే?

ఇదిలా ఉంటే ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా జరిగిన మీడియా మీట్ లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ టాక్ పై స్పందించారు.

Update: 2024-08-16 03:55 GMT

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి డివైడ్ టాక్ వస్తోంది. అయితే చిత్ర యూనిట్ తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సినిమా సక్సెస్ దిశగా అడుగులేస్తోందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇదిలా ఉంటే ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా జరిగిన మీడియా మీట్ లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ టాక్ పై స్పందించారు. మిక్స్డ్ రివ్యూలు, రేటింగ్స్ సినిమాలకి కొత్తకాదు. ఎప్పుడు చూసేవే. అయితే సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ పట్ల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అందరూ బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారికంటే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నవారే ఎక్కువ ఉన్నారు. ఈ వీకెండ్ హాలిడేస్ లో మిస్టర్ బచ్చన్ సినిమాని పబ్లిక్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని హరీష్ శంకర్ చెప్పారు.

మిక్స్డ్ రివ్యూలు వస్తాయని మేము ముందే ఊహించాం. అయితే మెల్లగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేసాం. రోజు రోజుకి ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని హరీష్ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అప్పీరియన్స్ గురించి హరీష్ శంకర్ స్పందించారు. సాంగ్ లో చిన్న బిట్ లో దేవిశ్రీ ప్రసాద్ కనిపిస్తారు. సాంగ్ లో అక్కడ ఎవరైన తెలిసిన వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించింది. అందరూ నన్ను చేయమని చెప్పారు.

అయితే నేను తప్పించుకోవాలని దేవిశ్రీప్రసాద్ ని పిలిచాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే నాకు మంచి మిత్రుడు. అందుకే పిలిచిన వెంటనే అతను వచ్చాడు. ఫ్రెండ్ షిప్ డే రోజు ఆ సాంగ్ షూట్ జరిగింది. దేవిశ్రీ రావడంతో ఆ సాంగ్ లో అతన్ని పెట్టడం జరిగిందని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. అలాగే మూవీ క్లైమాక్స్ లో రవితేజతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరో ఉంటే బాగుంటుందని అనిపించింది. అందుకే సిద్దు జొన్నలగడ్డని ఆ సీన్ లో పెట్టాను.

దానికి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చిన కూడా లాంగ్ రన్ లో మూవీ పాజిటివ్ కి టాక్ వస్తుందని హరీష్ శంకర్ తెలిపారు. మరి అతని అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News