గ్యాప్ వెకేషన్ మాత్రమే..రిలీజ్ తర్వాత సంచలనమే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథనాయకుడి హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథనాయకుడి హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇటీవలే చిత్రీకర ణకు బ్రేక్ పడింది. పవన్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో అన్ని సినిమా షూటింగ్ లు బంద్ పెట్టి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఏపీలో ఎన్నికలకు కూడా మూడు నాలుగు నెలలే సమయం ఉండటంతో? పవన్ ఇప్పట్లో ఏ సినిమా షూటింగ్ కి హాజరు కాడని తేలిపోయింది.
దీంతో తాత్కాలికంగా `భగత్ సింగ్` కూడా వాయిదా పడింది. అయితే ఇటీవలే హరీష్ శంకర్ నటసింహ బాలయ్య టాక్ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో అంతకంతకు హైప్ పెంచేస్తున్నాయి. ఈ గ్యాప్ కేవలం వెకేషన్ మాత్రమేనని....రిలీజ్ తర్వాత నెన్షేషన్ అని హరీష్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ వ్యాఖ్యాలు పవర్ స్టార్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.
ఈ సినిమా విషయంలో హీరష్ శంకర్ ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో? మాటల్ని బట్టే తెలిసిపోతుంది. అభిమానుల్లో అంతకంతకు జోష్ ని రెట్టింపు చేస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హరీష్ శంకర్ కి కొత్తేం కాదు. ఆయనా ఏ సినిమా తెరకెక్కించినా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని హైప్ క్రియేట్ అయ్యేలా మాట్లాడుతారని ఓ విమర్శ ఉంది. ఇప్పటివరకూ ఆయన ఏడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
తొలి సినిమా `షాక్` తో గట్టిగానే షాక్ తిన్నాడు. అటుపై `మిరపకాయ్` తో మంచి హిట్ అందుకున్నాడు. అదే ఊపును `గబ్బర్ సింగ్` కి కొనసాగించాడు. అది బ్లాక్ బస్టర్ అయింది. అటుపై తెరకెక్కించిన `రామయ్యా వస్తావయ్యా` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. అలాగే `సుబ్రమమణ్యం పర్ సేల్`..`దువ్వాడ జగన్నాధమ్`.. `గద్దల కొండ గణేష్` భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలు మిశ్రమ ఫలితాలు సాధించాయి.