రీమేక్ ప్రశ్నలు.. హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్
మాకు నచ్చిన కథని సినిమాగా చేస్తాం. ప్రేక్షకులకి నచ్చితేనే ఆ సినిమాని హిట్ చేస్తారు లేదంటే లేదు అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.
కమర్షియల్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆగష్టు 15న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన రెయిడ్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రెడీ చేశారు. అయితే తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తుంటే ఒరిజినల్ మూవీ నుంచి కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకొని ట్రీట్మెంట్ అంతా చేంజ్ చేసినట్లు అర్ధమవుతోంది.
ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. కచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో హరీష్ శంకర్ ఉన్నారు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానల్స్ లో హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఆయన్ని ప్రశ్నించారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరి కి రీమేక్ గా తెరకెక్కుతోంది కదా… ఈ ఐడియా మీదేనా లేదంటే పవన్ కళ్యాణ్ గారిదా అని ప్రశ్నించారు.
తెరి రీమేక్ ఎవరి నిర్ణయం అనేది ప్రేక్షకులకి అనవసరమైన విషయం. దీనికి హీరోగా పవన్ కళ్యాణ్, నిర్మాతగా మైత్రీ వారు, డైరెక్టర్ గా నేను సమాధానం చెప్పము. అయితే తెరి రీమేక్ ఎలా ఉంటుందని అడిగితే దానికి పబ్లిక్ కి కావాల్సిన ఆన్సర్ నేను చెబుతానని హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. రీమేక్ చేయాలనే ఆలోచన ఎవరిదని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అవసరం లేదు. ఫైనల్ గా సినిమా ప్రేక్షకులకి నచ్చిందా… లేదా అనేది ఇంపార్టెంట్.
మాకు నచ్చిన కథని సినిమాగా చేస్తాం. ప్రేక్షకులకి నచ్చితేనే ఆ సినిమాని హిట్ చేస్తారు లేదంటే లేదు అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తెరి రీమేక్ ఆపమని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. 2 లక్షల మంది పోస్టులు పెట్టి తనపై దాడి చేశారు. అయిన నేను ఎక్కడా తగ్గలేదు. రీమేక్ గురించి ప్రశ్నించే ప్రతి ఒక్కరికి నేనెందుకు సమాధానం చెబుతాను. మూవీ చేసిన తర్వాత నచ్చితే చూస్తారు లేదంటే లేదు అని హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు.
ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరి రీమేక్ అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. దానిని పవన్ కళ్యాణ్ తో ఎలా తెరకెక్కిస్తున్నారు. స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హరీష్ శంకర్ ఇప్పటి వరకు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలు రీమేక్ కథలతోనే చేశాడు. అయిన కూడా ఒరిజినల్ కంటే ఈ మూవీస్ పెద్ద హిట్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ కూడా బ్లాక్ బస్టర్ అయితే రీమేక్ ల విషయంలో హరీష్ శంకర్ ని ఇంకా ఎవరు కూడా విమర్శించే ఛాన్స్ ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.