ఫ్లాప్ హీరోతో మిస్ యూనివర్శ్ డెబ్యూ
ప్రభాస్ నటించిన వర్షం చిత్రాన్ని హిందీలో `బాఘి` పేరుతో రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు టైగర్ ష్రాఫ్.
ప్రభాస్ నటించిన వర్షం చిత్రాన్ని హిందీలో `బాఘి` పేరుతో రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు టైగర్ ష్రాఫ్. బాలీవుడ్ ఫ్రాంఛైజీ మొదటి చిత్రంలో సుధీర్ బాబు విలన్ (గోపిచంద్ పాత్రలో) గా నటించగా, అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. టైగర్ తో నువ్వా నేనా అంటూ సుధీర్ బాబు ఢీకొట్టిన సీన్లు హైలైట్ అయ్యాయి. వర్షం టాలీవుడ్ లో ఫ్రాంఛైజీగా మారకపోయినా దీనిని ఫ్రాంఛైజీగా మలుచుకుని టైగర్ బాలీవుడ్ లో వరస హిట్లు కొడుతున్నాడు. భాఘి, భాఘి 2 ఆశించిన విజయాల్ని సాధించగా, భాఘి 3 యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు `భాఘి 4` ప్రారంభించేందుకు టైగర్ ష్రాఫ్ బృందం సన్నాహకాల్లో ఉంది. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయి. సాజిద్ నడియాడ్ వాలా ఈ యాక్షన్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అహన్ శెట్టి కెరీర్‌లను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత చిత్రనిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా మరో టాలెంట్ అయిన మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధును లాంచ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. 2021లో హర్నాజ్ సంధు ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పాపులర్ బ్యానర్ నిర్మించే బాఘీ 4లో కథానాయికగా నటించడాన్ని అదృష్టంగా భావిస్తోంది. నిజానికి టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ , సోనమ్ బజ్వా వంటి తారలతో హర్నాజ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎగ్జయిట్ చేసే అంశం. తనదైన అందం, ఛరిష్మాతో ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హర్నాజ్ బాలీవుడ్ ఆరంగేట్రం కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఈ డెబ్యూ కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇటీవల కొన్ని వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న టైగర్ భాఘి 4 తో తిరిగి ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. హర్నాజ్ కి లక్ ఫేవర్ చేస్తుందో లేదో వేచి చూడాలి.
భాఘి ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలు యాక్షన్ ఎంటర్ టైనర్లుగా వచ్చి అలరించాయి. బాఘీ 4 లో రా యాక్షన్ ఉంటుందని ఇప్పటికే దర్శకుడు హర్ష.ఏ వెల్లడించారు. యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ని మరో స్థాయిలో ఎలివేట్ చేయనున్నామని తెలిపారు. ఇటీవల టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ ల లుక్ లను కూడా టీమ్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. బాఘీ 4 చిత్రం 5 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది.