హరోం హర.. 4 వారాలు ఆగాల్సిందే

హరోం హర మాత్రం ఏకంగా నాలుగు వారాల తర్వాతే ఓటీటీ స్క్రీన్ పై కనిపించబోతుంది.

Update: 2024-07-03 09:58 GMT

సుధీర్ బాబు హీరోగా రూపొందిన విభిన్న చిత్రం హరోం హర గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నికల హడావిడి పూర్తి అయిన తర్వాత విడుదల కావడంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌ గా నటించగా అక్షరా గౌడ మరియు సునీల్ లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమా విడుదలకు ముందు భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడంతో పాటు, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో సినిమా పై చర్చ జరిగింది.

థియేట్రికల్‌ రిలీజ్ అయినప్పుడు చూడలేక పోయిన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. ఈమధ్య కాలంలో రెండు మూడు వారాల్లోనే సినిమాలు స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి.

హరోం హర మాత్రం ఏకంగా నాలుగు వారాల తర్వాతే ఓటీటీ స్క్రీన్ పై కనిపించబోతుంది. నాలుగు వారాల కండీషన్ ను గట్టిగా పట్టుకున్న హరోం హర మేకర్స్ కి అభినందనలు అంటూ థియేటర్‌ లవర్స్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటీటీ లో ఈ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్న వారు మరో వారం ఆగాల్సిందే.

సుధీర్ బాబు ప్రతి సినిమాలో కూడా విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు, అలాగే తన ప్రతి పాత్ర కూడా విభిన్నంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. అందుకే హరోం హర అనే ఈ విభిన్నమైన సినిమా ను చేశాడు. ఓటీటీ లో కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News

eac