హారీస్ జైరాజ్.. ఈ ఛాన్స్ కూడా ఫ్లాప్
ఈ సినిమాకి అతని నుంచి చూసిన ఆశించిన స్థాయిలో మ్యూజిక్ రాలేదనే విమర్శలు వస్తున్నాయి. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఒక్కటి కూడా గుర్తుంచుకోదగ్గ విధంగా లేదు.
కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హారీస్ జైరాజ్ సొంతం చేసుకున్నారు. 2001లో మ్యూజిక్ డైరెక్టర్ గా అతను కెరియర్ స్టార్ట్ చేశాడు. మెజారిటీ తమిళంలోని అతని సీనిమాలు ఉంటాయి. అడపాదడపా ఇతర భాషలలో మూవీస్ ఉంటాయి. తమిళం తర్వాత హారీస్ జైరాజ్ పేరు తెలుగులో కొంత వరకు వినిపిస్తోంది.
వెంకటేష్ వాసు సినిమాతో హారీస్ జైరాజ్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ఫ్లాప్ అయిన మ్యూజికల్ హిట్ అయ్యింది. మరల వెంకటేష్ ఘర్షణ సినిమాకి సంగీతం అందించారు. తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుసైనికుడు మూవీకి మ్యూజిక్ సమకూర్చారు. రామ్ చరణ్ మూడో చిత్రం ఆరెంజ్ కి కూడా క్లాసిక్ మ్యూజిక్ ని హరీష్ జయరాజ్ అందించడం విశేషం.
తెలుగులో హారీస్ జైరాజ్ చేసిన సినిమాలు అన్ని మ్యూజికల్ ఆల్బమ్ పరంగా సక్సెస్ అయ్యాయి. సినిమాలు మాత్రం ఒక్క ఘర్షణ తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్ అయ్యాయి. సూపర్ స్టార్ స్పైడర్ సినిమాకి హరీష్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. మూవీ కూడా ఫెయిల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఏరికోరి నితిన్, వక్కంతం వంశీ తమ ఎక్స్ట్రార్డినరీ మెన్ మూవీ కోసం హరీష్ ని తీసుకున్నారు.
ఈ సినిమాకి అతని నుంచి చూసిన ఆశించిన స్థాయిలో మ్యూజిక్ రాలేదనే విమర్శలు వస్తున్నాయి. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఒక్కటి కూడా గుర్తుంచుకోదగ్గ విధంగా లేదు. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హారీస్ జైరాజ్ కి తమిళంలో కూడా పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి సమయంలో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు.
అయితే హారీస్ జైరాజ్ మాత్రం తనకి అలవాటైన పద్దతిలోనే తన మ్యూజిక్ తో తెలుగు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేశారు. నెక్స్ట్ నాగ శౌర్య 23వ చిత్రానికి హారీస్ జైరాజ్ తెలుగులో మ్యూజిక్ అందించబోతున్నారు. ఈ సినిమాకి అయిన బెస్ట్ మ్యూజిక్ అందించి హిట్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.