డెవిల్ కు యానిమాల్ దెబ్బ!

అంతేకాకుండా విఎఫ్ఎక్స్ పనులు కూడా ఫినిష్ కావాల్సి ఉందట. దీనివల్ల డెవిల్ సినిమా నవంబర్ నుంచి తప్పుకునే ఉన్నట్లుగా తెలుస్తోంది

Update: 2023-11-01 12:22 GMT

కళ్యాణ్ రామ్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో డెవిల్ ఒకటి. ఈ సినిమాలో అతను ఒక గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు అని పోస్టర్స్ ద్వారానే క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమా కంటెంట్ పరంగా అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. కానీ సినిమా ఒరిజినల్ దర్శకుడి పేరు మార్చేసి నిర్మాత అభిషేక్ నామ దర్శకుడిగా పేరు వేసుకోవడం తో ఇండస్ట్రీలో విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. అంతే కాకుండా ఒరిజినల్ దర్శకుడు సోషల్ మీడియాలో డౌట్ క్రియేట్ చేసే విధంగా ఒక పోస్ట్ కూడా వేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏది ఏమైనప్పటికి డెవిల్ సినిమా ప్రమోషన్స్ నాటికి ఈ విషయంపై తప్పనిసరిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది.

అయితే సినిమా విడుదల విషయంలో కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సినిమాలో మొదట ప్లాన్ ప్రకారం అయితే నవంబర్ 24 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా మళ్లీ ఆ డేట్ కు వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు విషయంలో ఆలస్యం జరుగుతోందట.

ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లో కాస్త బ్రేక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరం ప్రస్తుతం యానిమల్ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నాడు. అయితే డెవిల్ సినిమాకు కూడా అతనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇంకా డెవిల్ కు సంబంధించిన పనులు మొత్తం కూడా పూర్తి కాలేదట.

అంతేకాకుండా విఎఫ్ఎక్స్ పనులు కూడా ఫినిష్ కావాల్సి ఉందట. దీనివల్ల డెవిల్ సినిమా నవంబర్ నుంచి తప్పుకునే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ డేట్ మిస్ అయితే మాత్రం డిసెంబర్ లో మరో కొత్త డేట్ ను వెతుక్కోవడం కష్టతరమవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా కొత్త సినిమాలు మరి కొన్ని క్రేజ్ ఉన్న సినిమాలు రాబోతున్నాయి. మరి నిర్మాత ఎలాంటి రిస్క్ తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News