కెప్టెన్ కుర్చీ ఎక్కుతానంటోన్న యానిమల్!
సందీప్ తోనే హర్షవర్ధన్ ప్రతిభ కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నయా మ్యూజిక్ డైరెక్టర్....చిత్ర దర్శకుడిగానూ మారుతానంటున్నాడు.
'అర్జున్ రెడ్డి'..'కబీర్ సింగ్'..'యానిమల్' సినిమాలతో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్. ఆ మూడు విజయాలు అతనికి పాన్ ఇండియాలోనే ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొచ్చాయి. అందుకు కారకుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగనే. అతనే అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈ రేంజ్ లో ఫేమస్ అయ్యేవాడు కాదు. అతని ప్రతిభ బయట పడేది కాదు. అంతకు ముందు ఓ సినిమాకు పనిచేసాడు గానీ..అది పెద్దగా ఎవరికీ తెలియదు.
సందీప్ తోనే హర్షవర్ధన్ ప్రతిభ కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ నయా మ్యూజిక్ డైరెక్టర్....చిత్ర దర్శకుడిగానూ మారుతానంటున్నాడు. సంగీతం కట్టటడమే కాదు పెన్ను పట్టి కథలు రాసి సందీప్ రెడ్డిలా సినిమాలు చేసి సక్సెస్ అవుతాననని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆ సంగతులు ఏంటో అతని మాటల్లోనే.. 'భవిష్యత్ లో దర్శకత్వం చేస్తా. సంగీతం ప్రధానంగా ఓ సినిమా తెరకెక్కించాలని ఉంది.
దర్శకుడు సందీప్ రెడ్డికి ఇదే విషయం చెప్పాను. ఆయన దగ్గర రెండు సినిమాలకు పనిచేసి స్క్రిప్ట్ వర్క్ తో పాటు అన్నీ నేర్చుకోవాలి. అలాగే డ్రమ్స్ శివమణి జీవిత కథతో ఓ సినిమా చేయాలన్నది ఆశ. ఆయన ఒప్పుకుంటే కథ సిద్దం చేస్తాను' అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇళయరాజా...ఏ.ఆర్ రెహమాన్ సంగీతం వింటూ పెరిగాను. తెలియకుండానే వాళ్ల ప్రభావం నా సంగీతంలో కనిపిస్తుంది.
సంగీత దర్శకుడిగా భిన్నమైన ప్రయోగాలు చేయాలని ఉంటుంది. పాత రోజుల్లో చేసినట్లు ఒక సినిమా మొత్తాన్ని లైవ్ సెక్షన్ మ్యూజిక్ తో చేయాలని ఉంది. కానీ ఇవన్నీ ఇప్పుడే కాదు. అందుకు చాలా సమయం ఉంది. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నాను. ఇక్కడ నిలదొక్కుకున్న తర్వాత నేను అనుకు న్నవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తాను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. సందీప్ -ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'స్పిరిట్' చిత్రానికి నేనే పనిచే స్తున్నాను. కథ పూర్తి చేసి..మేలో కథ చెబుతానని సందీప్ చెప్పారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని అన్నారు.