స్వాగ్.. కాన్ఫిడెన్స్ మామూలుగా లేదే!!

యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న స్వాగ్ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Update: 2024-10-02 12:00 GMT

"ఇప్పటి వరకూ చూడని ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌, బెస్ట్‌ మూవీని త్వరలో మీరంతా చూడబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట ఇది. అక్టోబర్ 4వ తేదీ నుంచి సినిమా మాట్లాడుతుంది. ఆ తర్వాత మీరు సినిమా గురించి మాట్లాడతారు. 2024లోనే కాదు.. రాబోయే సంవత్సరాల్లో కూడా స్వాగ్ లాంటి మూవీ రాలేదని మీరు చెబుతారు".. ఇవి నిన్న జరిగిన స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హసిత్ గోలి చెేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న స్వాగ్ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. దసరాకు ముందస్తు కానుకగా అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి మీరా జాస్మిన్, సునీల్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్ తో పాటు గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ.. మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అందులో డైరెక్టర్ హసిత్ గోలితో పాటు హీరో విష్ణు చేసిన వ్యాఖ్యలు విని అంతా షాకవుతున్నారు. మూవీ వేరే లెవెల్ లో ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా వారిద్దరూ తెలిపారు. బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్ చూడనున్నారని హసిత్ అన్నారు. దసరా అయ్యాక కూడా సినిమా చూస్తూనే ఉంటారనే కాన్ఫిడెన్స్ ఉందని తెలిపారు. కచ్చితంగా అందరినీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అదే సమయంలో శ్రీవిష్ణు.. తెలుగు వాళ్లంతా గర్వపడేలా స్వాగ్ మూవీ ఉంటుందని తెలిపారు. టాలీవుడ్ ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల తాము గెలుస్తూ ఉంటామని, ఈసారి ఆడియన్స్ ను గెలిపించాలనుకుంటున్నామని తెలిపారు. మూవీ కచ్చితంగా మంచి ప్రభావం చూపుతుందని అన్నారు. దీంతో స్వాగ్ మేకర్స్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అర్థమవుతుంది. దేవర రిలీజ్ అయిన వారం రోజులకే స్వాగ్ ను విడుదల చేస్తున్న మేకర్స్.. తమకు కంటెంట్ మీద ఫుల్ నమ్మకం ఉన్నట్టు క్లియర్ గా చెబుతున్నారు.

అయితే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో స్వాగ్ పై ఆడియన్స్ లో వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ లో శ్రీవిష్ణు నాలుగు పాత్రల్లో అదరగొట్టేశారు. మేకర్స్ కూడా వాటిని అంతే రీతిలో డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కు డ్యూయల్ రోల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి శ్రీవిష్ణు స్వాగ్ మూవీతో ఎలా అలరిస్తారో? మేకర్స్ కాన్ఫిడెన్స్ కు తగ్గట్టు మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News