కేసుపై హర్షసాయి ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..

తాజాగా ఈ కేసు గురించి హర్షసాయి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు.

Update: 2024-09-25 05:32 GMT

యూట్యూబర్ హర్షసాయి తనపై నమోదైన అత్యాచార కేసుపై సోషల్ మీడియాలో స్పందించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో హర్ష సాయి పై మహారాష్ట్రకు చెందిన యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో యువతి హర్షసాయిపై అత్యాచారం, మోసం, బెదిరింపు ఆరోపణలు చేసింది. ఈ దీంతో హర్షసాయి పై పోలీసులు 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


తాజాగా ఈ కేసు గురించి హర్షసాయి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. "ఆమె నాపై చేసే ఆరోపణలు మొత్తం డబ్బుల కోసమే. ఈ ఆరోపణల వెనుక ఆమె ఉద్దేశం ఇదేనని నమ్ముతున్నాను. త్వరలోనే ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు వివరిస్తారు. నా ఫాలోవర్స్ కు తెలుసు నేను ఎలాంటి వ్యక్తినో" అంటూ హర్షసాయి ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ ద్వారా హర్షసాయి తనపై చేస్తున్న ఆరోపణలు తప్పని అంటూ తాను ఏ తప్పు చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇకపోతే ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌కి వచ్చిన యువతి తనపై హర్షసాయి పెళ్లి పేరుతో మోసం చేశాడని, అతను తనతో అనైతిక సంబంధాలు పెట్టుకొని, ఆపై విడిచి పెట్టాడని ఆరోపించింది.

అంతేకాకుండా, రెండు కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదు చేసింది. హర్షసాయి తనను బెదిరింపులకు గురి చేసి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తానని చెప్పి భయపెట్టాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం హర్షసాయి ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తూ, తన పక్షం న్యాయపరంగా విచారణ జరుగుతుందని సోషల్ మీడియాలో స్పందించారు.

యూ ట్యూబ్ ద్వారా సమజాసేవ చేస్తూ మంచి గుర్తింపు అందుకున్న హర్షసాయి కి సోషల్ మీడియాలో 10 మిలియన్స్ కు పైగా ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక హఠాత్తుగా హర్షసాయి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇప్పటివరకు హర్షసాయి ఈ కేసులో పూర్తి స్థాయిలో స్పందించలేదు కానీ, ఏ తప్పు చేయలేదు అన్నట్లు సున్నితంగా వివరించారు. మరి ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందో, హర్షసాయి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News