పిక్‌ టాక్ : అబ్బా అనిపించే హెబ్బా క్లోజప్‌ క్లిక్స్‌

సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

Update: 2024-12-02 10:30 GMT

కన్నడ చిత్రం 'అద్యక్ష' తో నటనా రంగంలో అడుగు పెట్టిన హెబ్బా పటేల్‌ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమె నటించిన 'కుమారి 21ఎఫ్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈతరం అమ్మాయిలకు రూపంగా హెబ్బా పటేల్ ఆ సినిమాలో కనిపించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా తెలుగులో మొదటి సినిమానే అయినా భలే నటించింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి మోడ్రన్‌ పాత్రల్లో నటించేందుకు అమ్మాయిలు కాస్త ఇబ్బంది పడుతారు. కానీ హెబ్బా పటేల్‌ మాత్రం ఈజీగా నటించి మెప్పించింది. అందుకే ఆ సినిమాతో టాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్లు దక్కించుకుంది.

హెబ్బా పటేల్‌ కి తెలుగులో ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. అయినా సినిమా ఇండస్ట్రీని వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. సినిమాలు సిరీస్‌లు అంటూ చాలానే ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. వచ్చిన ప్రతి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు అందాల ఆరబోత చేయడంతో పాటు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈమె ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాజాగా చీర కట్టులో ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ అమ్మడి చీర కట్టు క్లోజప్‌ క్లిక్స్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తెకు టాలీవుడ్‌ నుంచి సరైన ఆఫర్లు రాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, హెబ్బాకి కనీసం లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మరిన్ని ఆఫర్లు వచ్చి ఉండాల్సింది అంటున్నారు. కొన్ని సినిమాల్లో నటనతో హెబ్బా వావ్‌ అనిపించింది. అందంతోనూ అబ్బా అనిపించింది. అలాంటి హెబ్బా పటేల్‌ కి కాలం కలిసి రాలేదు, సినిమాల్లో ఇకపై అయినా మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో ఈమె ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అంధగాడు, 24 కిస్సెస్‌ తో పాటు ఇంకా పలు సినిమాల్లో నటించింది. ఇతర భాషల్లోనూ ఈమె నటించడం ద్వారా గుర్తింపు లభించింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు, కానీ కోలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. అక్కడ మూడు సినిమాల్లో ఒకటి రెండు హిట్ అయినా కచ్చితంగా మరిన్ని సినిమా ఆఫర్లు అక్కడ దక్కే అవకాశాలు ఉన్నాయి. పైగా తమిళ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఇలాంటి అందమైన చీర కట్టు ఫోటోల్లో కనిపింస్తే మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.

Tags:    

Similar News