హెబ్బా.. ఆ గ్లామర్ డోస్ అస్సలు తగ్గలే..
తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది అమ్మడు. సింపుల్ లెహంగా వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. అదిరిపోయిన డ్రెస్ తో హోయలు ఒలికించింది.
హెబ్బా పటేల్.. ఈ బ్యూటీకి యూత్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను దక్కించుకోనప్పటికీ క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది. కుమారి 21 ఎఫ్ మూవీతో కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లోకి చేరిపోయింది. అయితే సుమారు పదేళ్ల క్రితం అధ్యక్ష మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హెబ్బా.. అలా ఎలా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కుమారి 21 ఎఫ్ సినిమాలో తన అందం, అభినయంతో ఓ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించింది.
ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అందగాడు, మిస్టర్, 24 కిస్సెస్ తో పాటు అనేక సినిమాల్లో నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్లు సాధించలేకపోయింది. ఇక ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో అదిరిపోయే రోల్ చేసి మంచి హిట్ అందుకుంది. ఇటీవల గీత, శాసనసభ, హనీమూన్ ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది హెబ్బా పటేల్. ఎప్పటికప్పుడు తన పర్సనల్ తో పాటు సినిమా అప్డేట్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటోంది. పిక్స్ తో పాటు డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. అదిరిపోయే ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ అలరిస్తుంటోంది. రకరకాల డ్రెస్సుల్లో సూపర్ పోజులు ఇచ్చి మైమరిపిస్తుంటోంది. పొట్టి బట్టల్లో ఫిదా చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటోంది.
తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది అమ్మడు. సింపుల్ లెహంగా వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. అదిరిపోయిన డ్రెస్ తో హోయలు ఒలికించింది. రకరకాల పోజులు ఇస్తూ ఫిదా చేసింది. డీసెంట్ గా కనిపిస్తూనే గ్లోయింగ్ స్కిన్ తో మాయ చేసింది. క్రేజీ ఇయర్ రింగ్స్ అమ్మడు అందాన్ని మరింత పెంచాయి. హెబ్బా పోస్ట్ చేసిన పిక్స్.. క్షణాల్లో వైరల్ అయిపోయాయి. లైకులు కొడుతూ ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను కామెంట్స్ గా పెడుతున్నారు.