ఆయన గెడ్డం గీసాడు..ఈయన గీయలేదు..మిగతాదంతాసేమ్!
ఇద్దరు గజినీలో ఒకే సినిమాలో కలిసి నటించకపోయినా ఒకే ప్రేమ్ లోకనిపించి అభిమానులకు ఊపు తీసుకొచ్చారు.
కోలీవుడ్ గజిని..బాలీవుడ్ గజిని ఒకే ప్రేమ్ లో సాధ్యమేనా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ అరుదైన దృశ్యం విశ్వనటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా చోటు చేసుకుంది. నేడు కమల్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ లో మీడియా అంతటా విషెస్ తో హోరెత్తుతోంది. అయితే ఆ ముందు రోజు కమల్ గ్రాండ్ గా ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్...కోలీవుడ్ నటుడు సూర్య కూడా హాజరయ్యారు.
ఆ సందర్భంలో సూర్య..అమీర్ ఖాన్ తో పాటు సినిమాటోగ్రాఫర్ రవి. కె. చంద్రన్ కూడా ఉన్నారు. ఆయనే ఇలా ముగ్గుర్ని కవర్ చేస్తూ ఓ సెల్పీ క్లిక్ మనిపించారు. ఆయనే ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇద్దరు గజినీలో ఒకే సినిమాలో కలిసి నటించకపోయినా ఒకే ప్రేమ్ లోకనిపించి అభిమానులకు ఊపు తీసుకొచ్చారు. సూర్య గెడ్డం..నున్నగా దువ్విన హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు.
కళ్లకు గ్లాసెస్ ధరించి కెమెరా ముందు నవ్వుతూ కనిపించారు. ఆ వెనుక అమీర్ ఖాన్ హెయిర్ స్టైల్ కూడా సూర్య హెయిర్ స్టైల్ ని మ్యాచ్ చేసారు. ఆయన గెడ్డం గీసుకున్నారు..సూర్య గెడ్డం తీయలేదు. అంతే తేడా ..మిగతాదంతా సేమ్ టూ సేమ్ అప్ప.. అమీర్ కూడా కళద్దాలు ధరించారు. ఇక రవిచంద్రన్ జీన్స్ షర్ట్ లో కనిపిస్తున్నారు. ఆయనకు కళ్లకు అద్దాలు ధరించారు. ప్రస్తుతం ఈ పిక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
అభిమానులు ఈ ద్వయాన్నిచూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కలిసి సెల్పీలు దిగడమే కాదు..కలిసి సినిమాలు చేయాలి. అవి మేము చూడాలి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే దర్శకురాలు సుధా కొంగరతో కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. ఇక అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.