చిరంజీవిలా అవ‌మానాలు ఎదుర్కొని..!

సుప్రీం హీరో మెగాస్టార్ గా ఎదిగిన తీరు అసాధార‌ణ‌మైన‌ది. కృషితో నాస్తి దుర్భిక్షం.

Update: 2024-04-08 17:38 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభం ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌ని కొన్ని ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. అయితే అవ‌మానాల‌ను భ‌రించి, క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగి సుప్రీంహీరో అయ్యారు. కెరీర్ ఆరంభంలో స‌వాళ్ల‌ను అధిగ‌మించి త‌న‌ను తాను స్టార్ హీరోగా తీర్చిదిద్దుకున్నారు. కాల‌క్ర‌మంలో చిరును మెగాస్టార్ ని చేసారు అభిమానులు. సుప్రీం హీరో మెగాస్టార్ గా ఎదిగిన తీరు అసాధార‌ణ‌మైన‌ది. కృషితో నాస్తి దుర్భిక్షం. చేసే ప‌నిపైనే శ్ర‌ద్ధ పెట్టి శ్ర‌మిస్తే దానంత‌ట అదే ఫ‌లితం వ‌స్తుంద‌ని చిరంజీవి న‌మ్ముతారు. దానిని ఆచ‌రించి ఇంత‌టివాడ‌య్యారు.


ఇప్పుడు మావ‌య్య (చిరంజీవి) బాట‌లోనే అల్లు అర్జున్ కూడా త‌న‌ని తాను తీర్చిదిద్దుకున్న తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి అంటూ కీర్తిస్తోంది ప్ర‌పంచం. చిరంజీవి లానే కెరీర్ ఆరంభం కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు అల్లు అర్జున్. ఆరంభం గంగోత్రిలో నిక్కరులో త‌న వేష‌ధార‌ణ, లేడీ గెట‌ప్ చూసి విమ‌ర్శించిన వారు ఉన్నారు. అది ఒక ర‌కంగా అవ‌మాన‌మే. కానీ అన్నిటినీ త‌న ప్ర‌తిభ‌తో అధిగ‌మించాడు. ఈరోజు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అంటూ ప్ర‌పంచం మ‌న‌స్ఫూర్తిగా కీర్తిస్తోంది. అభిమానులు అత‌డికి నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. పుష్ప చిత్రంతో అత‌డి పేరు జాతీయ అంత‌ర్జాతీయ‌ స్థాయిలో మార్మోగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ‌న్ని న‌ట‌న‌, డ్యాన్సుల్ని ప్ర‌శంసించారు. టాలీవుడ్ 90 ఏళ్ల హిస్ట‌రీలో ఉత్త‌మ న‌టుడుగా జాతీయ అవార్డ్ అందుకున్న ఏకైక న‌టుడ‌య్యాడు.


ఇప్పుడు పుష్ప 2తో ఫ్యాన్స్ ని అల‌రించ‌డానికి వ‌స్తున్నాడు. ఈ చిత్రంతో బ‌న్ని రేంజ్ మ‌రింత‌గా మారిపోనుంద‌ని అంచ‌నా. తాజాగా రిలీజ్ చేసిన బ‌ర్త్ డే టీజ‌ర్ లో బ‌న్ని విశ్వ‌రూపం చూపించాడ‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. ఈ టీజ‌ర్ లో అత‌డు అప‌ర‌కాళిక‌లా, అమ్మ‌వారిలా దూసుకొస్తున్న వైనం, యాక్ష‌న్ ప్యాక్డ్ అప్పియ‌రెన్స్ కి మాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సీక్వెల్ లో యాక్ష‌న్ మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు బ‌న్ని ఎదుగుద‌ల‌ను కీర్తిస్తున్నారు ఫ్యాన్స్.

తొలి చిత్రం `గంగోత్రి`లో లేడీ గెట‌ప్ న‌చ్చ‌ని వాళ్లే ఇప్పుడు `పుష్ప 2`లో లేడీ గెట‌ప్ లో క‌నిపిస్తున్న అదే బ‌న్నీని చూసి విప‌రీతంగా పొగిడేస్తున్నారు. గిట్ట‌నివాళ్ల‌ను కూడా మార్చేసేంత‌గా అత‌డు త‌న ప‌రివ‌ర్త‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. నేడు సంపూర్ణత ప‌రిపూర్ణ‌త ఉన్న స్టార్ గా అల్లు అర్జున్ ఆవిర్భ‌వించాడు. ఐకాన్ స్టార్ అన్న బిరుదుకు త‌గ్గ‌ట్టుగానే అత‌డు త‌న స్థాయిని ఆవిష్క‌రిస్తున్నాడు. పుష్ప 2 క‌చ్ఛితంగా రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌తో 1000 కోట్ల క్ల‌బ్ ని అందుకోవ‌డం ఖాయ‌మ‌ని బ‌న్ని ఫ్యాన్స్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News