అగ్ర నిర్మాణ సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ట్యాలెంటెడ్ హీరో
ఇండస్ట్రీలో ఇన్ సైడర్స్ ని ఎంకరేజ్ చేసే ధర్మ అధినేత ఔట్ సైడర్స్ విషయంలో నిర్ధయగా వ్యవహరిస్తారని కంగన లాంటి కథానాయిక చాలాసార్లు ఆరోపించారు.
అవును.. అగ్ర నిర్మాణ సంస్థ పలువురు హీరోలను అనధికారికంగా బ్యాన్ చేసింది. ఇందులో ఇప్పుడు మరో హీరో చేరాడు. నిజానికి ఆ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్. కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ పై అప్ కం ట్యాలెంట్ తీవ్రంగా ఆరోపించడం ఇప్పుడే కొత్త కాదు. సంస్థ చెప్పింది వినకపోతే లేదా వారు చెప్పిన కాంట్రాక్టుకు అంగీకరించకపోతే నిర్ధయగా సదరు సంస్థ `బ్లాక్ లిస్టు`లో పెడుతుందని ఆ తర్వాత అవకాశాలు తెరమరుగవుతాయని ఇప్పటికే పలువురు హీరోలు ఆరోపించారు. ఇన్ సైడర్, ఔట్ సైడర్ డిబేట్ లో ఇది ప్రధానంగా చర్చకు తెర తీసిన అంశం. ఇండస్ట్రీలో ఇన్ సైడర్స్ ని ఎంకరేజ్ చేసే ధర్మ అధినేత ఔట్ సైడర్స్ విషయంలో నిర్ధయగా వ్యవహరిస్తారని కంగన లాంటి కథానాయిక చాలాసార్లు ఆరోపించారు.
ఇంతకుముందు పరిశ్రమలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఇద్దరు హీరోలపై ధర్మ ప్రొడక్షన్స్ నిషేధం విధించడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ప్రతిభావంతులైన ఇద్దరు హీరోలు ఆ సంస్థలో ఎప్పటికీ నటించలేని స్థితి ఇప్పుడు ఉంది. అలాగే దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా ఇదే పెద్దలు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసారని కూడా ప్రచారం ఉంది. సుశాంత్ సింగ్ మరణానంతరం ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ అతడి కోటరి చేసిన కుట్రలకు బలైపోయాడని కూడా ఆవేదన వ్యక్తమైంది. కరణ్ పార్టీలకు అటెండ్ కాని ట్యాలెంటుకు కూడా ఇదే గతి పడుతుందన్న నివేదనలు ఆవేదనలు కనిపించాయి. క్వీన్ కంగన రనౌత్ అయితే నేరుగా కరణ్ కుట్రపూరిత వ్యవహారాలన్నిటినీ బహిర్గతంగానే ఎండగడుతుంది. పరిశ్రమలో ఔట్ సైడర్ అయిన తనపై జరిగిన కుట్రల గురించి మాట్లాడుతూ కరణ్ లాంటి వాళ్లు ఎలాంటి కుట్రలకు పాల్పడ్డారో కూడా కంగన పలుమార్లు వెల్లడించింది.
కార్తీక్ ఆర్యన్ ని దోస్తానా టైమ్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కరణ్ ధర్మ ప్రొడక్షన్స్.. ఆయుష్మాన్ ఖురానాకు అవకాశాలివ్వలేదని చెబుతారు. ఇప్పుడు ఇదే జాబితాలో మరో యువహీరో చేరాడు. బహిరంగంగా అతడు చేసిన తాజా ఆరోపణలు దీనిని స్పష్ఠం చేస్తున్నాయి. కొన్ని ఫైనెస్ట్ పెర్ఫామెన్సెస్ తో సత్తా ఉన్న నటుడిగా నిరూపించిన యువహీరో సిద్ధాంత్ చతుర్వేది ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ధర్మ ప్రొడక్షన్స్ భారీ చిత్రం `బ్రహ్మాస్త` ఆఫర్ కాదన్నానని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు! అంటూ సిద్ధాంత్ ఆవేదన చెందడం ఇప్పుడు బయటపడింది. తనకు అవకాశాలు రాకుండా కాస్టింగ్ డైరెక్టర్లు దందా చేస్తున్నారని ఆరోపించాడు. ఇంతకుముందు బ్రహ్మాస్త్రలో నటించాలని ఆఫర్ ఇచ్చారు. కానీ తన పాత్ర ఏమిటో చెప్పలేదు.. తనకు డైలాగ్ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇదంతా జాతీయ అవార్డ్ విన్నంగ్ మూవీ `గల్లీ బోయ్` కి ఒక నెల ముందు జరిగిన విషయం అని కూడా సిద్ధాంత్ చెప్పాడు. ఒకరకంగా అతడు ఆవేదన చెందాడు.
గల్లీబోయ్- గెహ్రయాన్ (దీపికతో) లాంటి చిత్రాలతో సిద్ధాంత్ చతుర్వేది పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన గల్లీ బాయ్‌లో అతని నటన ఇప్పటికీ అందరి మదిలో తాజాగా ఉంది. అయితే సిద్ధాంత్‌కి బ్రహ్మాస్త్రలో పాత్రను ఆఫర్ చేసినట్లు చాలా మందికి తెలియదు.. కానీ అతను దానిని తిరస్కరించాడు. ఆ తర్వాత అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఆఫర్లు తగ్గాయి. ఇటీవల ప్రముఖ హిందీ పోర్టల్‌తో సంభాషణలో సిద్ధాంత్ చతుర్వేది తాను కూడా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడించాడు.
``ముజే బ్లాక్‌లిస్ట్ కర్ దియా గయా కాస్టింగ్ సే. బ్లాక్ లిస్ట్ కర్ దియా కీ యే తో పాగల్ హై లడ్కా. బద్నామ్ హో గయా థా మెయిన్ కాస్టింగ్ సర్క్యూట్ మే కి యే సెలెక్ట్ హో కే నా బోల్ దేతా హై`` అని అతడు వ్యాఖ్యానించాడు. గల్లీ బాయ్‌కి ఒక నెల ముందు బ్రహ్మాస్త్ర ఆఫర్ వచ్చింది. కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా అవకాశం వచ్చింది. అన్ని పాత్రలలో నాది ఒకటి అన్నారు. కానీ దీనికి స్క్రిప్ట్ లేదా ఆడిషన్ లేదు. మీరు మార్షల్ ఆర్ట్స్ చేయండి.. ఇది యాక్షన్ ఫాంటసీ చిత్రం.. అని మాత్రమే చెప్పారు. ఈ సినిమాను కచ్ఛితంగా వదలకుండా చేయాలని వారు చెప్పారు. భారీ VFX ఉన్న భారీ ప్రాజెక్ట్. పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది.. అని అన్నారు. ఇది విన్నాక ``నేను చేయలేన``ని కాస్టింగ్ డైరెక్టర్‌కి చెప్పాను. అతను లేచి నిలబడి ``పాగల్ హై, ధర్మ కే సాథ్ హై, 3 ఫిలిమ్స్ కా కాంట్రాక్ట్ హై`` అన్నాడు. అందుకే అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి తారలు నటిస్తుంటే నన్ను ఎవరు చూస్తారు? అని అన్నాను. సినిమాలో తాను చెప్పేది అర్థం చేసుకోవడానికి కనీసం రెండు లైన్ల డైలాగ్‌లు ఉండాలని కోరుకున్నాను అని అన్నాడు.
సిద్ధాంత్ చతుర్వేది నటించిన `ఖో గయే హమ్ కహాన్` త్వరలో విడుదల కానుంది. ఇమాద్ (సిద్ధాంత్ చతుర్వేది), అహనా (అనన్య పాండే) .. నీల్ (ఆదర్శ్ గౌరవ్) జీవితాలను ముగ్గురు ప్రాణ స్నేహితుల సాపేక్షమైన ప్రయాణం గురించిన సినిమా ఇది. యువతరం ఆకాంక్షలు, సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించారు.