ర‌జ‌నీ సూప‌ర్ స్టార్ అవుతాడ‌ని ఊహించ‌లేదు!

సీనియ‌ర్ న‌టుడు హేమ సుంద‌ర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కొన్ని వంద‌ల చిత్రాల్లో న‌టించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అత‌ను.

Update: 2024-12-01 12:30 GMT

సీనియ‌ర్ న‌టుడు హేమ సుంద‌ర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కొన్ని వంద‌ల చిత్రాల్లో న‌టించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అత‌ను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు లాంటి లెజెండ్స్ తో వెండి తెర‌ను పంచుకున్న గొప్ప న‌టుడు. ఆ త‌ర్వాత త‌రం హీరోల‌తోనూ ఎన్నో సినిమాలు న‌టించారు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ హీరోల‌తోనూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా హేమ సుంద‌ర్ ఇండస్ట్రీలో త‌న అనుభ‌వాలు పంచుకున్నారు. `నేను ఏఎన్నార్ ను చూసే ఇండస్ట్రీకి వచ్చాను. నేరుగా ఆయననే అవకాశాలు అడిగాను. అలా ఆయన సినిమా `విచిత్రబంధం`తోనే నా కెరియర్ మొదలైంది.

నేను ఎన్టీఆర్ గారికి తాత పాత్రలో నటించాను. అప్పటికే ఆయన గొప్పనటుడు. నేను వేసిన తాత పాత్ర .. ఎస్వీఆర్ - గుమ్మడివంటి వారు వేయవలసిన పాత్ర. కానీ ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒక సీన్లో మనవడిగా నా పాదాలపై పడమని దర్శకుడు చెప్పకపోయినా రామారావుగారు హఠాత్తుగా అలా చేశారు. అది ఊహించని నేను బిత్తరపోయాను. పాత్ర గురించి తప్ప మరిదేని గురించి ఆలోచన చేయని మహానుభావుడు ఆయన. అలాంటి గొప్ప వారితో న‌టించే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం.

అప్పట్లో రజనీకాంత్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇద్దరం బాలచందర్ స్కూల్ నుంచి రావడం కూడా ఒక కారణం. ఆయన అలా ఒక స్టార్ గా అంత వేంగా దూసుకెళతాడని నేను కూడా ఊహించలేదు. అంద‌రితో పాటు అత‌ను సినిమాల్లోకి వ‌చ్చారు. నెమ్మ‌దిగానే కెరీర్ సాగుతుంద‌నుకున్నా. కానీ ఆయ‌న రాకెట్ లా దూసుకుపోయారు. ఇక‌ నటుడిగా నాకు దక్కిన గౌరవం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.

నాకు ఇప్పుడు 83 ఏళ్లు. నేను ఒక టాబ్లెట్ వేసుకోక ఎన్నేళ్లు అయిందో. ఆరోగ్యంగా ఉండటం నా అదృష్టం . అవకాశాలు ఇస్తే నటించడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను` అన్నారు. సినిమాల‌తో పాటు టీవీ సీరియ‌ళ్ల‌లోనూ న‌టించారు. హేమ సుంద‌ర్ ప‌లు అవార్డ‌లు..రివార్డులు కూడా అందుకున్నారు.

Tags:    

Similar News