ఆ స్టార్ న్యూ జ‌ర్నీ లో నిజ‌మెంత‌?

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా 45వ చిత్రం ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-17 20:30 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా 45వ చిత్రం ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఇంత‌కాలం న‌టుడిగా కొన‌సాగిన బాలాజీ తొలిసారి సూర్య సినిమాతో కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. న‌టుడిగా అత‌డికి మంచి పేరుంది. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగానూ స‌త్తా చాటే క్ర‌మంలో సూర్య ని త‌న క‌త‌థో ఒప్పించి మెప్పించాడు. ఇంత వ‌ర‌కూ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన అనుభ‌వం లేదు. అయినా సూర్య స్టోరీ స‌హా అత‌డిపై న‌మ్మ‌కంతో ఛాన్స్ ఇచ్చాడు.

ఓ ర‌కంగా సూర్య ఫేజ్ లో ఇది కాస్త రిస్క్ అయినా? చేస్తున్నాడు. అత‌డి గ‌త చిత్రం `కంగువ` భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. అయినా త‌న ప్లాప్ ల్ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా కొత్త వాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. తాజాగా ఈప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో హీరో విశాల్ న‌టిస్తున్నాడుట‌. ఇటీవ‌లే బాలాజీ విశాల్ కి క‌థ చెప్పి ఒప్పించిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా విశాల్ పోషించేది విల‌న్ పాత్ర అని కూడా వినిపిస్తుంది. విదేశాల్లో ఉండి ఇండియాలో క్రైమ్ ని ర‌న్ చేసే ఓ డాన్ రోల్ అని మ‌రో వార్త వినిపిస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ఒక‌వేళ గెస్ట్ రోల్ అయితే విశాల్ ఇప్ప‌టికే ఆ త‌ర‌హా పాత్ర‌లు రెండు...మూడు సినిమాల్లో పోషించాడు. కానీ ప్ర‌తి నాయ‌కుడిగా మాత్రం ఇంత వ‌ర‌కూ న‌టించ‌లేదు. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు..న‌టన‌తో మెప్పించాడు త‌ప్ప బ‌ల‌మైన విల‌న్ పాత్ర‌ల జోలికి వెళ్ల‌లేదు.

ఈ నేప‌థ్యంలో సూర్య సినిమాలో విశాల్ విల‌న్ అనే వార్త అభిమానుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇక విశాల్ కొంత కాలంగా సొంత బ్యాన‌ర్లోనే సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో తానే హీరోగా న‌టిస్తున్నాడు. బ‌య‌ట బ్యాన‌ర్లలో చేయ‌డం లేదు. దీంతో అత‌డు ఆ ఛాన్స్ తీసుకోలేదా? ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది సందిగ్గంలో ఉంది. ఇప్పుడేమో సూర్య సినిమాలో కీలక పాత్ర అంశం? ఎన్నో సందేహాల‌కు తావిస్తోంది.

Tags:    

Similar News