విడాకులపై హీరోయిన్ స్పందన
ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారని, తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.
సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీ కపుల్ విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. దాంతో ఇండస్ట్రీలో ఎప్పుడూ విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారని, తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.
జ్యోతిక గత కొన్నాళ్లుగా ముంబైలో ఉన్న కారణంగా ఆమె సూర్య నుంచి దూరంగా ఉంటుందని కూడా ప్రధానంగా ప్రచారం జరిగింది. తమిళ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో తాజాగా జ్యోతిక స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు సూర్య ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించిన నేపథ్యంలో జ్యోతిక క్లారిటీ ఇచ్చింది.
తాజాగా జ్యోతిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ముంబై లో ఉన్న విషయం వాస్తవం అంది. అయితే సూర్య నుంచి విడిపోలేదు అని చెప్పుకొచ్చింది. పిల్లల చదువులు మరియు తన తల్లిదండ్రుల కోసం తాను ముంబైలో ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న కారణంగా కూడా తాను ముంబైలో ఉంటున్నట్లుగా జ్యోతిక చెప్పుకొచ్చింది. వృద్దులు అయిన తన తల్లిదండ్రులకు ప్రస్తుతం తన అవసరం ఉందని భావించి ముంబైలో ఉంటున్నట్లుగా జ్యోతిక క్లారిటీ ఇవ్వడంతో సూర్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చు కుంటున్నారు.
ఈ మధ్య కాలంలో సూర్య వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆయన విడాకుల విషయమై స్పందించక పోవడం ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిక అంతగా క్లారిటీ ఇచ్చిన కూడా కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సూర్య నుంచి స్పందన వస్తుందేమో చూడాలి.