హీరోయిన్ల మైండ్ సెట్ ఇలా మారిపోయిందేంటి..?
ఇందులో ఎవరు ఎలాంటి సినిమాలు తీయాలన్నది ఆ హీరోయిన్స్ కి వచ్చిన క్రేజ్ ని బట్టి ఉంటుంది.
ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో కథానాయిక బాధ్యత ఎంత అన్నది చెప్పడం కష్టం. కమర్షియల్ సినిమాలకు ఒకలా కంటెంట్ ఉన్న సినిమాలకు మరోలా హీరోయిన్స్ కేటగిరీ చేస్తుంటారు. కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. ఐతే ఆ టైం లో నిడివి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. కానీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో మాత్రం కేవలం పాటలకే హీరోయిన్ అనే మాట వినిపిస్తుంది. ఇందులో ఎవరు ఎలాంటి సినిమాలు తీయాలన్నది ఆ హీరోయిన్స్ కి వచ్చిన క్రేజ్ ని బట్టి ఉంటుంది.
ఇదీఔంటే ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించాలంటే హీరోయిన్స్ కాస్త వెనక్కి తగ్గే వారు. సీనియర్ హీరోలతో జత కడితే కెరీర్ అయిపోయినట్టే అనే టాక్ ఉండేది. అయినా సరే కొందరు హీరోయిన్స్ వాటిని పట్టించుకోకుండా సీనియర్ స్టార్స్ తో నటించారు. ఐతే ఇప్పుడు పంథా మారింది. సీనియర్ హీరో సినిమా ఛాన్స్ అంటే చాలు ఎగిరిగి గంతేస్తూ ఆ ఛాన్స్ అందుకుంటున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో నటిస్తే ఆ హీరో ఫ్యాన్స్ అంతా కూడా హీరోయిన్స్ ని ట్రెండింగ్ లో ఉంచుతారు. అందుకే కథానాయికలు ఒకప్పుడు సీనియర్ హీరోల విషయంలో నో చెప్పినా ఇప్పుడు మాత్రం అలాంటి ఛాన్స్ లు అస్సలు మిస్ అవ్వట్లేదు. స్టార్ హీరోల అభిమానుల దృష్టిలో పడితే హీరోయిన్స్ ఫాం లో ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా చర్చల్లో అయినా ఉంటారు.
ఇక ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే మాత్రం ఆ హీరోయిన్ పంట పండినట్టే అవుతుంది. మొత్తానికి సీనియర్ స్టార్స్ తో మొన్నటిదాకా కాదు కూడదు అన్న భామలు సైతం మేము చేస్తాం అంటే మేము చేస్తామని వెంటపడే పరిస్థితి ఏర్పడింది. కచ్చితంగా ఈ మార్పు వారి కెరీర్ కు మంచి లాభదాయకమని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లతో యువ కథానాయికలు కూడా జత కడుతూ అలరిస్తున్నారు.
సీనియర్లతో నటించడం వల్ల వారి అనుభవ పాఠాలే కాకుండా నటనలో పరిణితి కూడా పొందేలా వారి సూచనలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. సో సీనియర్స్ తో హీరోయిన్స్ కు డబుల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు.