యువ హీరో గుడ్ న్యూస్.. వారసుడొచ్చాడు

జూనియర్ హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు! అదేనండీ నటీమణులతో పాటు నటుల భార్యలు పండంటి బిడ్డలకు జన్మనిస్తున్నారు.

Update: 2024-02-21 09:27 GMT
యువ హీరో గుడ్ న్యూస్.. వారసుడొచ్చాడు
  • whatsapp icon

జూనియర్ హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు! అదేనండీ నటీమణులతో పాటు నటుల భార్యలు పండంటి బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.


ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. తన కొడుకును ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిఖిల్ భార్య ప్రసవించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా నిఖిల్-పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నెట్టింట ఫ్యాన్స్ కూడా నిఖిల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

అయితే నిఖిల్ తన భార్య.. ప్రెగ్నెంట్ అని మొన్నమొన్నటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదు. డైరెక్ట్ గా పల్లవి సీమంతం ఫొటోలను షేర్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. భార్యతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశారు. ఇటీవల బేబీకి డైపర్ ఎలా వేయాలో కూడా నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో కూడా పోస్ట్ చేశారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న నిఖిల్‌, పల్లవి 2020లో ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఇక డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ హ్యాపీ డేస్ తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. ఆ తర్వాత వివిధ చిత్రాల్లో నటించారు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందుకున్నారు. కార్తికేయ 2 సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ గా మారిపోయారు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా చిత్రం స్వయంభులో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో నిఖిల్ యుద్ధ వీరుడిగా అలరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీతోనే భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం నిఖిల్ ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News