ఆ స్టార్ హీరోలు ఈ రేంజ్ లో ఛేంజ్!

కోలీవుడ్ స్టార్ హీరోలు న్యూలుక్ లో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. న్యూ మేకోవ‌ర్ లో కొత్త అనుభూతిని పంచుతున్నారు

Update: 2023-10-30 17:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరోలు న్యూలుక్ లో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. న్యూ మేకోవ‌ర్ లో కొత్త అనుభూతిని పంచుతున్నారు. పాత్ర‌ల్ని బ‌ట్టి హీరోల్ని మేక‌ర్స్ పూర్తిగా న్యూలుక్ లో లాంచ్ చేస్తున్నారు. తెలుగు ఆడియ‌న్స్ కి ఆ గెటెప్స్ అంత‌గా క‌నెక్ట్ కాన‌ప్ప‌టికీ మాతృభాష‌లో మాత్రం బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. ఇటీవ‌లే 'మార్క్ ఆంటోనీ'లో విశాల్ న్యూ గెట‌ప్ లో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

హెయిర్ స్టైల్ స‌హా కాస్ట్మూమ్స్ ప్ర‌తీది విశాల్ ని కొత్త‌గా ప్రోజెక్ట్ చేసింది. విశాల్ లుక్ ప‌రంగా ఇంత‌వ‌ర‌కూ కేవ‌లం బాడీ షేప్ లో మార్పులు తెచ్చాడు. తొలిసారి ఆహార్యం మాత్రం పూర్తి భిన్న‌గా అనిపించింది మాత్రం 'మార్క్ ఆంటోనీ'లో. ఆ సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌లే రిలీజ్ అయిన 'లియో' లో విజయ్ లుక్ కూడా కాస్త కొత్త‌గానే అనిపించింది. హెయిర్ స్టైల్... వాకింగ్ స్టైల్ అన్నింటిలోనూ కొత్త ద‌నం క‌నిపించింది. ఇది విజ‌య్ లో లోకేష్ తెచ్చిన మార్పుగా తెలుస్తోంది.

అంత‌కు ముందు 'విక్ర‌మ్' లో రోలెక్స్ పాత్ర కోసం సూర్య లుక్ లోనూ మార్పులు చేసాడు. డ్ర‌గ్ మాఫిడా డాన్ గా ప‌ర్పెక్ట్ గెట‌ప్ లో సూర్య‌ని లాంచ్ చేసాడు. ఈ లుక్ స‌హా పాత్ర సూర్య కెరీర్ నే మార్చేసింది. అప్ప‌టి వ‌ర‌కూ సూర్య‌లో డీసెంట్ హీరోని చూసిన అభిమానులు క‌రుడ‌గ‌ట్టిన నేర‌స్తుడిని చూడ‌టం మొద‌లు పెట్టారు. తాజాగా 'జపాన్' చిత్రంలో కార్తీ లుక్ కూడా అభిమానులు కొత్త అనుభూతిని పంచుతుంది. రింగు రింగుల జుత్తు...పాత్ర‌కు త‌గ్గ‌ట్టు దుస్తులు అన్ని కార్తికి కొత్గగా ప్ర‌జెంట్ చేస్తున్నాయి.

అలాగే 'తాంగ‌లాన్' చిత్రంలో విక్ర‌మ్ అఘెర గెట‌ప్ లో క‌నిపిస్తున్నాడు. అత‌డి హెయిర్ స్టైల్...ఆహ‌ర్యం ప్ర‌తీది విక్ర‌మ్ ని స్పెష‌ల్ గా ఫోక‌స్ చేస్తున్నాయి. గెట‌ప్స్ విష‌యంలో విక్ర‌మ్ ఆరితేరిన న‌టుడు. ఎలాంటి గెట‌ప్ వేసినా అందులో ఒదిగిపోతాడు. పాత్ర‌లో జీవిస్తాడు. ఇలాంటి మేకోవ‌ర్లు ఆయ‌న‌కు కొత్తేం కాదు. ఇక సూర్య న‌టిస్తోన్న చిత్రం 'కంగువా' లోనూ న్యూ మేకోవ‌ర్లో ఆక‌ట్టుకుంటున్నాడు.

పిరియాడిక్ చిత్రం కావ‌డంతో ఆపాత్ర కోసం సూర్య ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యాడు. అంత‌కు ముందు సెవెన్త్ సెన్స్ లోనూ ఇంట్రెస్టింగ్ లుక్ తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక క‌మ‌ల్ హాస‌న్...ర‌జ‌నీకాంత్ లాంటి న‌టులు యంగ్ హీరోల్ని మించి న్యూ మేకోవ‌ర్లో ఆక‌ట్టుకున్న న‌టులే.

Tags:    

Similar News