చేసేవన్నీ ఫ్లాప్ సినిమాలు... విమర్శలా?

తెలుగు లో ఒకప్పుడు స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధుకి ప్రస్తుతం అస్సలు మార్కెట్‌ లేదు అని గత చిత్రాలతో నిరూపితం అయ్యింది

Update: 2023-10-04 14:30 GMT

బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్‌ మరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. తమిళ్ లో ఈయన స్వయంగా నిర్మించిన చిత్తా సినిమాను తెలుగు లో చిన్నా పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నాడు. చిత్తా సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు గాను సిద్ధు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

తమిళ్‌ లో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్‌ అయింది. ఇటీవల బెంగళూరులో ఈ సినిమా మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సిద్దార్థ్ కి ఎదురైన అనుభవం నేపథ్యంలో సినిమా కి మంచి పబ్లిసిటీ దక్కింది అనడంలో సందేహం లేదు. సిద్ధు హీరోగా ఈ మధ్య కాలంలో ఒక్క కమర్షియల్‌ సక్సెస్ ని కూడా దక్కించుకోలేక పోయాడు.

తెలుగు లో ఒకప్పుడు స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధుకి ప్రస్తుతం అస్సలు మార్కెట్‌ లేదు అని గత చిత్రాలతో నిరూపితం అయ్యింది. శర్వానంద్ తో కలిసి నటించిన మహాసముద్రం డిజాస్టర్‌ అవ్వగా.. టక్కర్‌ సినిమా తెలుగు లో డబ్‌ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో చిన్నా సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు.

ఈ వారంలో టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్దకు ఆరు సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలకు థియేటర్ల సర్దుబాటు చేయడం అనేది కాస్త కష్టమైన విషయం. చిన్నా సినిమా కి సాధ్యం అయినని సినిమాలు ఇచ్చినా కూడా తాజా మీడియా సమావేశంలో సిద్ధార్థ్‌ తనకు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ నిర్మాతలపై విమర్శలు చేయడం చర్చనీయాంశం అయింది.

ఇతర భాషల్లో చిత్తా సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కాయి. కానీ తెలుగు వారు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నారు. థియేటర్లు ఇవ్వమంటే సిద్ధార్థ్‌ సినిమాని ఎవరు చూస్తారు అంటూ థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసి.. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.

సిద్ధార్థ్‌ చేసిన ఆరోపణలపై తెలుగు నిర్మాతలు, బయ్యర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస ఫ్లాప్‌ సినిమాలతో మార్కెట్‌ కోల్పోయిన సిద్ధార్థ్‌ ఇప్పుడు తన సినిమా కు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రేక్షకుల్లో బజ్‌ ఉంటే పోటీ పడి మరీ ఎక్కువ థియేటర్లు ఇస్తారు.

సినిమా విడుదల అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున థియేటర్ల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంటుంది. కానీ సిద్ధార్థ్‌ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని కొందరు చురకలు అంటిస్తున్నారు.

Tags:    

Similar News