నన్ను మోసం చేసిన వారు సంతోషంగా లేరు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలనాటి అందగాడు సుమన్ ప్రస్థానం గురించి పరిచయం అవసరం లేదు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలనాటి అందగాడు సుమన్ ప్రస్థానం గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గు ర్తింపును దక్కించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని కలిగి ఉన్నారు. ఒకనొక దశలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలకే పోటా పోటీగా సినిమాలు చేసిన నటుడాయన.
అప్పటి యువతలో విపరీ తమైన ఫాలోయింగ్ నటుడు. ఇదంతా ఒకరకమైన జర్నీ. ఇక భక్తి రస చిత్రాల్లో దేవుళ్ల పాత్రలు పోషించాలంటే? అది కేవలం సుమన్ తోనే సాధ్యమని నమ్మే మేకర్స్ ఎంతో మంది.
పాత్రాలకు కేవలం తాను మాత్రమే న్యాయం చేయగలరని అంతా నమ్ముతుంటారు. రాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పాత్రలు పోషించాలంటే సుమన్ మాత్రమే ఆప్షన్. అలాగే ప్రతినాయకుడి పాత్రల్లోనూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
`శివాజీ` లాంటి సినిమా మంచి ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇలా సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించిన నటుడిగా సుమన్ కి పేరుంది. పాజిటివ్ పాత్రలు అంతే గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `నేను మొదటి నుంచి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే నన్ను మోసం చేసినవాళ్లను నేనేమీ అనలేదు. నన్ను అలా చేసిన వాళ్లలో కొంతమంది ఇప్పుడు లేరు.
ఉన్నవాళ్ల కుటుంబాలు ఎవరూ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లని నేను మనసులో కూడా తిట్టుకోలేను. వాళ్లు బాగుండలనే కోరుకుంటాను. కర్మనుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాళ్లను అలా చూడటానికి నాకూ బాధగానే అనిపిస్తూ ఉంటుంది` అని అన్నారు.