తగ్గేదేలే ఆ హీరో సెకెండ్ ఇన్నింగ్స్ డిసైడెడ్!
కోలీవుడ్ నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన 'మామన్నన్' ఇటీవల రిలీజ్ అయి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే
కోలీవుడ్ నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన 'మామన్నన్' ఇటీవల రిలీజ్ అయి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఉదయనిధి చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మంచి విజయం సాధించడంతో? ఆయన ఆనందానికి అవదుల్లేవ్. చివరి సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఆయన ఊహించలేదు. అసాధారణ విజయం సాధించడంతో ఉదయనిది తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని కోలీవుడ్ లో ప్రచారం సాగింది.
సినిమా జీవితాన్ని వదిలేసుకుని రాజకీయాల్లో కి ఎందుకు వెళ్తాడు? అని ఆయన చేసిన వ్యాఖ్యలు సరదాగా అయి ఉంటాయని కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా మామన్నన్ అర్ధశత దినోత్సవ వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఉదయనిధి మరో సారి తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక సినిమాల్లో కొనసాగనని..తన జీవనం కొత్తగా మొదలువుతుందని వ్యాఖ్యా నించారు.
'నేను నటించిన మొదటి చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే చివరి చిత్రం 'మామన్నన్' బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందుకు ప్రేక్షకులకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. నా కెరీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి మార్పులేదు' అని అన్నారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా స్టాలిన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే భవిష్యత్ లో రాజకీయ వారుసుడిగా ఉదయనిధిని కొనసాగించాల్నది ప్లాన్.
దీనిలో భాగంగా ఉదయనిది ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ప్రధానమైన బాధ్యతలు తండ్రి నిర్వర్తిస్తున్నారు. తదానంతరం ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఉదయనిధి. ఈ నేపథ్యంలో ఆయన ముందుగానే సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే వేడుకలో భాగంగా సంగీత దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ మాట్లాడారు. 'సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతు న్నాయనే మనోవేదన గత 30 ఏళ్లుగా నా మదిలో ఉండేది. ఇదే సమయంలో దర్శకుడు కథ చెప్పడంతో బాగా కనెక్ట్ అయ్యాను' అని అన్నారు.