కస్తూరికి షాక్ ఇచ్చిన హైకోర్టు!
ఇంతలోనే ఆమె ముందొస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించింది.
తెలుగు వారిని ఉద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ప్రతిగా కస్తూరిపై తమిళనాడు నుంచే వివిధ సెక్షన్ల కింద పోలీసు కేసులు నమోదవ్వడం..అరెస్ట్ కోసం పోలీసులు ఆమె ఇంటికెళ్లడం... ఇంటికి తాళాలు వేసి ఉండటం..ఆమె ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటం తో పోలీసులు పరారీగా నిర్దారించుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతలోనే ఆమె ముందొస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించింది.
దీంతో ఆమెకి ముందొస్తు బెయిల్ వస్తుందా? రాదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా కస్తూరి పిటీషన్ పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పిటీషన్ కొట్టేసింది. దీంతో ఆమెకు ఈ కేసులో ముందొస్తు బెయిల్ దొరకడం సాధ్యం కాని పనిగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో కస్తూరి తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పింది. తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజల్ని కించ పరిచే విధంగా మాట్లాడలేదని, తాను చేసిన వ్యాఖ్యల్ని డీఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేసారని మండిపడింది.
వాళ్లంతా కలిసి కావాలనే ఇలా చేసారని వాపోయింది. అయినా కస్తూరిపై కేసుల పరంపర ఆగలేదు. చెన్నై, మధురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదుయ్యాయి. తెలుగు సంఘాల ఆమెపై భగ్గుమన్నాయి. ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా? తెలుగు సంఘాలు వెనక్కి తగ్గలేదు. చట్టపరంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మరి ముందొస్తు బెయిల్ పిటీషన్ కొట్టేసిన నేపథ్యంలో కస్తూరి రియాక్షన్ ఎలా ఉంటుంది? తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్తుందా? లేదా? అన్నది చూడాలి.
హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రాహ్మాణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ కస్తూరి తెలుగు వారిని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యానించింది. అవి నెట్టింట వైరల్ అవ్వ డంతో? ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తమిళనాడు లో ఉన్న తెలుగు సంఘాలు, ప్రజలు ఆమెపై సీరియస్ అయ్యాయి.