డబుల్ ఇస్మార్ట్ బిజినెస్.. సేఫ్ జోన్ లోనే..

రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ కి జరిగింది. థీయాట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ కలిపితే 130+ కోట్ల వరకు లెక్కలు తేలాయి.

Update: 2024-08-01 04:10 GMT

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగష్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ ఐదు భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. రామ్, పూరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తూ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మణిశర్మ చాలా కాలం తర్వాత బెస్ట్ సాంగ్స్ కి ఈ చిత్రానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి 55 కోట్లకి అన్ని భాషలకి కలిపి కొనుగోలు చేసారంట. ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయని తెలుస్తోంది.

ఈ సినిమాకి ఏకంగా 76 కోట్లు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా పూరి టీమ్ కి వచ్చినట్లు సమాచారం. సౌత్ భాషల డిజిటల్ రైట్స్ అన్ని కలిపి 33 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందంట. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 35 కోట్లకి వెళ్లాయంట. ఆడియో రైట్స్ ని 8 కోట్లకి అమ్మినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం నాన్ థీయాట్రికల్ బిజినెస్ ద్వారా పూరి కనెక్ట్స్ కి 76 కోట్ల ఆదాయం వచ్చినట్లు అర్ధమవుతోంది.

పెట్టిన పెట్టుబడి దాదాపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవరీ అయినట్లు తెలుస్తోంది. అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ లోనే సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్పవచ్చు. రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ కి జరిగింది. థీయాట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ కలిపితే 130+ కోట్ల వరకు లెక్కలు తేలాయి.

రామ్ కెరియర్ లో స్కంద మూవీపైన హైయెస్ట్ బిజినెస్ జరిగింది. ఆ సినిమా బిజినెస్ డీల్స్ ని డబుల్ ఇస్మార్ట్ బ్రేక్ చేసింది. ఈ సినిమాతో 100+ కోట్ల కలెక్షన్స్ అందుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అదే జరిగితే రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా నిలుస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ కాబోయే డబుల్ ఇస్మార్ట్ కి పోటీగా మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనేది చూడాలి.

Tags:    

Similar News