550 సార్లు రీ-రిలీజ్ అయిన ఒకే ఒక్క సినిమా!
టాలీవుడ్ లో కొనసాగుతోన్న రీ-రిలీజ్ ట్రెండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ లో కొనసాగుతోన్న రీ-రిలీజ్ ట్రెండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలన్నింటిని ఏదో సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. టాలీవుడ్ ను చూసి కోలీవుడ్ కూడా రీ-రిలీజ్ లు షురూ చేసింది. అక్కడా ఇప్పుడీ రీ-రిలీజ్ ఓ అలవాటుగా మారింది.
అయితే రీ-రిలీజ్ లు అనేవి ఇంతవరకూ కేవలం రెండుసార్లే జరిగాయి. మరి 550 సార్లు రీ-రిలీజ్ అయిన గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కిన చిత్రం ఏదైనా ఉందా? అంటే ఉందనే తెలుస్తోంది. కన్నడ సినిమా ఈ రికార్డును నమోదు చేసింది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన `ఓం `అనే చిత్రం ఆ రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో శివకుమార్ హీరోగా, ప్రేమ హీరోయిన్ గా నటించారు. 1995 మే 9న ఈ చిత్రం కన్నడలో రిలీజ్ అయింది.
అంటే ఇప్పటికి సుమారు 30 ఏళ్లు అవుతుంది. అయినా ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా కోసం ఏకంగా రియల్ ఖైదీలనే తీసుకొచ్చారు. కొంత మంది ఖైదీలను బెయిల్ పై బయటకు తీసుకొచ్చి మరీ ఉపేంద్ర తెరకెక్కించాడు. ఇందులో కరుడగట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. అందుకే సినిమా అప్పట్లో అంత సంచల నమైంది. ఈసినిమా 70లక్షల ఖర్చుతో నిర్మించారు. బెంగుళూరులోని కపిల్ థియేటర్లోనే 35 సార్లు రి-రిలీజ్ చేసారు.
ఒకే థియేటర్లో ఎక్కువ సార్లు రిలీజ్ అయిన చిత్రంగానూ మరో రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఈ థియేటర్ సొంతం. ఆ తర్వాత చాలా థియేటర్లో చాలాసార్లు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆ లెక్క 550గా తేలింది. ఈ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా `ఓంకారమ్` టైటిల్ తో రీమేక్ చేసారు. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో `అర్జున్ పండిట్` టైటిల్ తో సన్నీడియోల్, జుహీ చావ్లా కూడా రీమేక్ చేసి సక్సస్ అందుకున్నారు.