తండేల్ 'హైలెస్సా హైలెస్సా'.. మరో బ్యూటీఫుల్ సాంగ్

ప్రేమలో గాఢంగా ఉన్న ఓ జంటను చూస్తున్న అనుభూతిని ఈ పాట కలిగిస్తుంది. పాటలోని ట్యూన్ ఎంతగానో ఆకట్టుకున్నా, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం దానికి రెట్టింపు హైప్ తీసుకొస్తోంది.

Update: 2025-01-23 15:25 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక తన లేటెస్ట్ మూవీ తండేల్ కూడా కొత్త తరహా కంటెంట్ తో థ్రిల్ చేసేందుకు రాబోతోంది. తండేల్ రాజు పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా బుజ్జితల్లి పాటతో మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు సంబంధించిన మరో బ్యూటీఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. 'హైలెస్సా హైలెస్సా' అనే ఈ సాంగ్ విడుదలైన కొద్దీ సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట పూర్తిగా ప్రత్యేకమైన మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నాకాష్ అజీజ్, శ్రేయ ఘోషల్ గాత్రం పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా శ్రీమణి రాసిన సాహిత్యం ఇద్దరు ప్రేమికుల అనుబంధాన్ని బాగా హైలెట్ చేస్తోంది. ఈ పాటలో యువ జంట మధ్యనున్న భావోద్వేగాలను పదునుగా మలిచారు. ఇక ఈ పాటలో అతి ముఖ్యమైన మరొక ఎట్రాక్షన్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ. ఈ ఇద్దరి మధ్య ప్రేమభావాలు పండించిన తీరు పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రేమలో గాఢంగా ఉన్న ఓ జంటను చూస్తున్న అనుభూతిని ఈ పాట కలిగిస్తుంది. పాటలోని ట్యూన్ ఎంతగానో ఆకట్టుకున్నా, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం దానికి రెట్టింపు హైప్ తీసుకొస్తోంది. ఇక సాయి పల్లవి తన డ్యాన్స్ ద్వారా పాటకు ప్రాణం పోసింది. చివర్లో చేసిన డ్యాన్స్ మూవ్స్ ఓ నాట్యమయూరి మెరిసినట్టు అనిపిస్తాయి. ప్రత్యేకంగా పాటలో వినిపించిన ఫ్లూట్ బిట్స్, సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

'బుజ్జి తల్లి' లాంటి చార్ట్‌బస్టర్ తర్వాత 'హైలెస్సా హైలెస్సా' కూడా అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ పాట విడుదలతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే 'బుజ్జి తల్లి' పాటకు 55 మిలియన్ వ్యూస్ వచ్చిన నేపథ్యంలో 'హైలెస్సా హైలెస్సా' పాటకు కూడా భారీ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ మాత్రమే కాక, ఈ సినిమాలోని కథ కథనాలపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయ్యేలా చేస్తోంది. ఇక తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News