ఒక పక్క కాన్సర్ కీమో ట్రీట్మెంట్ ...మరో పక్క షూటింగ్ .. గట్స్ అంటే ఇలా ఉండాలి!

స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్ తన ప్రయాణంలో సానుకూల దృక్పథాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Update: 2024-07-16 05:31 GMT

స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్ర‌ముఖ న‌టికి ప్ర‌స్తుతం కీమో థెర‌పీ బెడ్ పై ఉన్నారు. ఇది చాలా బాధ‌ను క‌లిగించే చికిత్స‌. అయితే ఇంత‌టి అనారోగ్యంలో ఉన్నా కానీ స‌ద‌రు నటి కించిత్ క‌ల‌త అయినా చెంద‌లేదు. న‌టిగా తన ప్రయాణం విష‌యంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. త‌న‌ను తాను కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని, ప్రాముఖ్యతను నొక్కి చెబుతూనే.. స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూనే... త‌న వృత్తిని కూడా విడిచిపెట్ట‌న‌ని అంటోంది. ఆమె సెట్స్ లో ప్ర‌త్య‌క్ష‌మై అంద‌రికీ స్ఫూర్తి నింపింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? అంటే బిగ్ బాస్ ఫేం హీనా ఖాన్.

స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్ తన ప్రయాణంలో సానుకూల దృక్పథాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. స‌వాళ్ల‌ను అధిగ‌మించి ముందుకు ఎలా సాగాలో హీనా వెల్ల‌డించింది. హీనా ఖాన్ ఇటీవలే స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. త‌న రోగ నిర్ధారణ గురించి కొన్ని విష‌యాలు షేర్ చేసింది. తన మొదటి కీమోథెరపీ తర్వాత డ్రెస్సింగ్ కి సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ చికిత్స‌ తనకు ఎంత సవాల్‌గా ఉందనే దాని గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది. హీనా మాట్లాడుతూ .. నా మొదటి కీమో సెషన్ తర్వాత నా మొదటి షూట్ కి వ‌చ్చాను. నేను భయపడ్డాను.. కుట్లు దాచడానికి ప్రయత్నిస్తున్నాను.. మనం చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నాను.. మొదటి సెషన్ తర్వాత నేను విగ్‌ని పెట్టుకున్నాను.. ఇంకా చాలా ఉన్నాయి. షో కొనసాగుతుంది.. నేను దాని నుండి బయటకు వస్తాను.. షూటింగ్ కొనసాగిస్తాను.. నేను గెలుస్తాను``అని హీనా రాశారు. జీవితంలో అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు జీవితాన్ని గడపడం మర్చిపోవద్దు... మార్పును అంగీకరించండి.. వ్యత్యాసాన్ని స్వీకరించండి.. జ‌న‌ర‌లైజ్ చేయండి! అని హీనా రాసారు.

నేను మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాను.. ఎందుకంటే నేను ఇష్టపడే పనిని నేను చేస్తాను.. నేను నా పనిని ప్రేమిస్తున్నాను. నేను పని చేస్తున్నప్పుడు కలలను ముందుకు సాగిస్తున్నాను. అదే నాకు గొప్ప ప్రేరణ. నేను నా పనిని కొనసాగించాలనుకుంటున్నాను. చాలా మంది వ్యక్తులు తమ చికిత్స సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా పని చేస్తున్నారు. నేను ఇటీవ‌ల‌ కొందరిని కలుసుకున్నాను. నన్ను నమ్మి నేను చికిత్స పొందుతున్నాను.. మ‌న‌కు బలం ఉంటే, సంతోషాన్ని కలిగించేదంతా చేయాల‌ని న‌మ్ముతాను.. అని తెలిపింది.

క్యాన్సర్‌తో పోరాడుతున్న హీనా ఖాన్ సాహసోపేత ప్రయాణంలో ఎంతో ధైర్యంగా తన జుట్టును కత్తిరించే వీడియోను కూడా షేర్ చేసింది! అది వైర‌ల్ గా మారింది. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీతో పోరాడుతున్న అందరూ గుర్తుంచుకోండి.. ఇది మీ కథ.. ఇది మీ జీవితం. దీన్ని ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి. వదులుకోకండి.. మీరు ఇష్టపడేదాన్ని కనుగొనండి. మీ పని, మీ అభిరుచి ఏమిటో మీకు తెలియకపోతే, మీరు ఇష్టపడేదాన్ని వ‌దులుకోవ‌డ‌మే అని గుర్తుంచుకోండి.. అని హీనా అన్నారు.

Tags:    

Similar News