రానా 'హిరణ్యకశ్యప'.. గుణశేఖర్ గొడవ లేకుండా..
గుణశేఖర్ ఇచ్చిన పాయింట్ తోనే సినిమాగా రూపొందిస్తున్నారని ప్రచారం మొదలైంది
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కాంట్రవర్సీలలో రానా 'హిరణ్యకశ్యప' ఒకటి. ఆయన ఎప్పుడైతే కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారో... దర్శకుడు గుణశేఖర్ తో వివాదం మొదలైంది. ఎందుకంటే అసలీ చిత్రం ఈ ఇద్దరి కాంబోలో రావాల్సింది. కానీ రానా కొన్ని అనివార్య కారణలతో గుణశేఖర్ ను సైలెంట్ గా పక్కనపెట్టి.. సొంతంగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో బిజీ అయిపోయారు.
దీంతో రానా ఈ కథను.. గుణశేఖర్ ఇచ్చిన పాయింట్ తోనే సినిమాగా రూపొందిస్తున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడా సినిమా గుణశేఖర్ పాయింట్ తో కాదని అర్థమైపోయింది. ఈ వాదనలకు.. రీసెంట్ గా మూవీ కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసి వాటికి చెక్ పెట్టారు రానా. ఆ వీడియోలో డిఫరెంట్ స్కెచెస్ తో పాటు కామిక్ రూపంలో ఉన్న 'హిరణ్యకశ్యప'ను చూపిస్తూ కథ బేస్ లైన్ వివరించే ప్రయత్నం చేశారు . అలాగే ఇతిహాస పాత్ర ప్రహ్లాదను చూపించారు.
ఈ సినిమాను అమర్ చిత్ర కథ కామిక్ బుక్ ఆధారంగా తన సొంత బ్యానర్ అయిన స్పిరిట్ మీడియాలో రానా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి ప్రముఖ స్టోరీ బుక్ పబ్లిషింగ్ హౌస్ అయిన అమర్ చిత్ర కథ కూడా నిర్మాతగా భాగస్వామ్యమైంది. అంటే దీని బట్టి.. ఈ 'హిరణ్యకశ్యప' కథ ఐడియా సదరు బుక్ పబ్లిషర్ ది అని తెలిసింది.
ఈ అమర్ చిత్ర కథ.. 'ప్రహ్లాద' పేరుతో ఓ కథను కామిక్ బుక్ రూపంలో 1973లో పబ్లిష్ చేసింది. ఇప్పుడా బుక్ నే విజువల్ ఎఫెస్ట్ ఫ్యాంటసీ ఫిల్మ్ గా రూపొందించాలని భావిస్తోంది. ఆ కథనే ప్రహ్లాద తండ్రి రాక్షస రాజైన 'హిరణ్యకశ్యప' పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది.
కాబట్టి రానా 'హిరణ్యకశ్యప' కథ.. దర్శకుడు గణశేఖర్ స్టోరీ బేస్ లైన్ కాదని క్లారిటీ వచ్చినట్టైంది. అలా కాన్సెప్ట్ టీజర్ ద్వారా రానా..గుణశేఖర్ కథను దొంగిలించలేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే ఈ 'హిరణ్యకశ్యప'కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పూర్తి కథను అందించనున్నారు. కాకపోతే ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారనేది ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది.