కాశ్మీర్ లో నాని హై వోల్టేజ్ యాక్షన్
ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్రారంభించారు.
నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలనూ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమాతో పాటు యూనానిమస్ ప్రొడక్షన్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్రారంభించారు.
ఈ షెడ్యూల్‌లో నాని పాల్గొని కీలక సన్నివేశాలతో పాటు ఊహించని యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్‌లో నానికి తోడుగా యాక్షన్ ఫైటర్స్ సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. నాని సీరియస్ లుక్‌లో భయంకరమైన ఫైట్ చేస్తున్న ఫోటో కూడా విడుదలైంది. అది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే వచ్చిన కేజీఎఫ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి, ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ కథలో నాని ఒక హిట్ ఆఫీసర్‌గా మరింత క్లిష్టమైన కేసును ఎలా చేధిస్తాడనే ఆసక్తికర కథాంశం నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. అలాగే విలన్స్ పై ఊచకోత కోసే విధానం హై వోల్టేజ్ తరహాలో ఉంటుందని సమాచారం.
నాని ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్, డైనమిక్ లుక్‌ను ఆయన ప్రదర్శనలో చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో నాని క్యారెక్టర్‌ను పవర్ఫుల్ కంటెంట్ తో చూపించారు. నాని ఇలాంటి పాత్రల్లో గతంలో కనిపించకపోవడం విశేషం. ఈ పాత్ర కోసం నాని ఫిట్‌నెస్‌తో పాటు కొత్త లుక్‌ను సెట్ చేసుకున్నారు.
ఈ చిత్రానికి ప్రతిభావంతమైన టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తోంది. సానూ జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ ఆర్ చూస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను శ్రీ నాగేంద్ర తంగల చేపట్టారు. ఈ టీమ్ క్రైమ్ థ్రిల్లర్‌కు అవసరమైన టెక్నికల్ స్టాండర్డ్స్‌ను మరింత పటిష్టంగా అందిస్తున్నారు. హిట్ 3 సినిమా 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరికొత్త యాక్షన్ అవతారం ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా ఆయనకు మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత మరింత కీలకమైన పార్ట్ కోసం మరో సెట్ లో షూటింగ్ కొనసాగించనున్నట్లు సమాచారం.