హిట్ 3.. RRR - బాహుబలి 2 కంటే గట్టిగానే!
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.;

నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో తొలిసారిగా హిట్ 3 సినిమా ద్వారా బ్రూటల్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ ఇప్పటికే HIT యూనివర్స్‌లో మూడో భాగంగా భారీ అంచనాల నడుమ వస్తోంది. గతంలో వచ్చిన HIT, HIT 2 సినిమాలు మంచి విజయాలు సాధించగా.. హిట్ 3 మాత్రం విజువల్స్, స్టైల్, కథాంశం అన్నింటినీ దాటి కొత్త రేంజ్‌లో ఉండబోతోంది అనే అంచనాలు మొదట నుంచే ఉన్నాయి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందులో నాని అత్యంత పవర్ఫుల్ గా, ఓ అగ్రెసివ్ కాప్‌గా కనిపించడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టైల్ అన్నీ కలిపి సినిమా పట్ల క్రేజ్ పెంచేశాయి. ట్రైలర్ 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించిన, తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
RRR ట్రైలర్ 23 మిలియన్ మార్కును దాటేందుకు ఒకటి రెండు రోజులు పట్టగా, బాహుబలి 2 ట్రైలర్ కూడా ఇలా హైపర్ స్పీడ్ వ్యూస్ రాబట్టలేదు. అంటే నాని పేరు ట్రెండ్ అవుతుండటం అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్‌లోని విజువల్స్ చూసి చాలా మంది ప్రేక్షకులు ఇది అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని అంటున్నారు.
మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం, నాని రోరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, టెక్నికల్ టీం కష్టం అన్నీ కలిసి ట్రైలర్‌ను ఒక డిఫరెంట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా తాలూకు ప్రమోషన్లను చాలా సీరియస్‌గా తీసుకున్న నాని, దీన్ని తాను డిఫరెంట్ స్కేల్‌కి తీసుకెళ్లాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. హిట్ 3 అంచనాలను బట్టి చూస్తే, ఈ సినిమాలో బిగ్ హిట్ గా నిలిచే అవకాశం ఉందమి తెలుస్తోంది.
ప్రశాంతి తిపిరినేని ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మే 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ట్రైలర్ వలన బుకింగ్‌లు కూడా ఊహించిన దానికంటే ముందుగానే స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఓపెనింగ్స్ తోనే నాని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల టార్గెట్ తో విడుదల అవుతోంది.