ట్యాలెంటెడ్ నటుడికి రెండో హాలీవుడ్ ఆఫర్
2020లో క్రిస్ హెమ్స్‌వర్త్‌తో కలిసి ఎక్స్‌ట్రాక్షన్ తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సాజుగా అతడి నటన చూశాక సామ్ అతడిని మరోసారి ఎంచుకున్నాడు.
బాలీవుడ్ లో తన స్థాయికి తగ్గ అవకాశాలు దక్కలేదని వాపోయే నటుల్లో రణదీప్ హుడా ఒకరు. కారణం ఏదైనా చాలా కాలంగా రణదీప్ హుడాకు హిందీ చిత్రసీమ అవకాశాలివ్వలేదు. ఆసక్తికరంగా అతడికి హాలీవుడ్ లో అరుదైన ప్రయోగాలు చేసే అవకాశం కలిగింది. 2020లో క్రిస్ హెమ్స్‌వర్త్‌తో కలిసి ఎక్స్‌ట్రాక్షన్ తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సాజుగా అతడి నటన చూశాక సామ్ అతడిని మరోసారి ఎంచుకున్నాడు.
రణదీప్ నుంచి పెద్ద ప్రకటన వచ్చింది. సహజంగానే సోషల్ మీడియాల్లో అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. రణ్‌దీప్ హుడా ఈ గుర్తింపుకు అర్హుడు! ఎక్స్‌ట్రాక్షన్‌లో అతని పని అద్భుతంగా ఉంది. జాన్ సెనాతో అతన్ని చూడటానికి వేచి ఉండలేను! అని ఒక అభిమాని రాసారు. బాలీవుడ్ అతడికి సరైన అవకాశాలివ్వలేదని కొందరు అభిమానులు వాపోయారు.
ఈ చిత్రం ప్రపంచం ఎదుర్కొన బోతున్న విపత్తును నివారించడానికి ఏకం అవుతూ తమ కోల్పోయిన బంధాన్ని తిరిగి కనుగొన్న ఇద్దరు బాల్య స్నేహితుల కథతో రూపొందుతోంది.ఈ చిత్రంలో టెయోనా పారిస్, జెస్సికా బీల్, సామ్ రిచర్డ్‌సన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. రణదీప్ కి నిర్మాతగా ఇది రెండో హాలీవుడ్ చిత్రం. మ్యాచ్ బాక్స్ అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ - డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఇ సంచలనం జాన్ సెనాతో కలిసి పనిచేస్తున్నాడు. సామ్ హార్‌గ్రేవ్ దర్శకత్వం వహించిన మ్యాచ్‌బాక్స్ మాట్టెల్ ఐకానిక్ డై-కాస్ట్ బొమ్మ వాహనాల నుండి ప్రేరణ పొందింది.